Advertisementt

‘యవ్వనం ఒక ఫాంటసీ’ ఆడియో రిలీజ్‌

Mon 13th Apr 2015 05:23 AM
yavvanam oka fantasy,aravind krishna,subra ayyappa,jeevan thomas,prasad neelam  ‘యవ్వనం ఒక ఫాంటసీ’ ఆడియో రిలీజ్‌
‘యవ్వనం ఒక ఫాంటసీ’ ఆడియో రిలీజ్‌
Advertisement
Ads by CJ

అరవింద్‌కృష్ణ, సుబ్ర అయ్యప్ప హీరోహీరోయిన్లుగా పురందేశ్వరి ఫిలింస్‌ పతాకంపై ప్రసాద్‌ నీలమ్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘యవ్వనం ఒక ఫాంటసీ’. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఆదివారం హైదరాబాద్‌లోని క్లబ్‌ రిపబ్లిక్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు గోపీచంద్‌ మలినేని ఆడియోను ఆవిష్కరించి తొలి సి.డి.ని ప్రముఖ దర్శకుడు వీరశంకర్‌, ప్రముఖ నిర్మాత రాజ్‌ కందుకూరికి అందించారు. జీవన్‌ థామస్‌ సంగీతం అందించిన ఈ ఆడియో లహరి మ్యూజిక్‌ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో అరవింద్‌కృష్ణ, హీరోయిన్‌ సుబ్ర అయ్యప్ప, ప్రభాస్‌ శ్రీను, వైవాహర్ష, జయవాణి, కెమెరామెన్‌ జైపాల్‌రెడ్డి, సంగీత దర్శకుడు జీవన్‌ థామస్‌, ముకుంద్‌పాండే, దర్శకనిర్మాత ప్రసాద్‌ నీలమ్‌, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..

వీరశంకర్‌: జీవన్‌థామస్‌గారు యమగోల మళ్ళీ మొదలైంది చిత్రానికి చాలా మంచి మ్యూజిక్‌ చేశారు. ప్రసాద్‌గారు ఇంతకుముందు చేసిన సినిమాలకు కూడా సంగీతం అందించారు. ప్రసాద్‌గారు ఈ చిత్రాన్ని చాలా ఎఫర్ట్‌ పెట్టి నిర్మించారు. ఒక సినిమాని ప్రొడ్యూస్‌ చెయ్యడం ఎంత కష్టమో నాకు తెలుసు. ప్రసాద్‌గారి కష్టానికి తగిన ఫలితం ఈ చిత్రం అందిస్తుందని నా నమ్మకం. కమల్‌హాసన్‌గారి మన్మథలీల ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్‌ అవుతుంది. 

సుబ్బారెడ్డి: జీవన్‌ థామస్‌గారు చేసిన పాటలు చాలా బాగున్నాయి. పాటల్ని విజువల్‌గా కూడా బాగా తీశారు. ప్రసాద్‌గారు చేస్తున్న ఈ సినిమా విజయం సాధించి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. 

జీవన్‌ థామస్‌: ప్రసాద్‌గారితో నేను చేస్తున్న మూడో సినిమా ఇది. చాలా ప్యాషనేట్‌గా ఈ సినిమా చేశారు. మంచి మ్యూజిక్‌ చెయ్యడంలో నాకు చాలా ఫ్రీడమ్‌ ఇచ్చారు. భాస్కరభట్లగారు మంచి లిరిక్స్‌ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా మంచి హిట్‌ అవుతుంది.

రాజ్‌ కందుకూరి: టైటిల్‌ చాలా బాగుంది. ఈ ఆడియో ఫంక్షన్‌ని పబ్‌లో వెరైటీగా చేస్తున్నారు. అరవింద్‌ కృష్ణ నాకు మంచి ఫ్రెండ్‌. ప్రసాద్‌గారు దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలి.

గోపీచంద్‌ మలినేని: మంచి టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా పోస్టర్స్‌ కూడా యునీక్‌గా వున్నాయి. పాటలు విజువల్‌గా కూడా చాలా బాగున్నాయి. నీలమ్‌ ప్రసాద్‌గారు నాకు చాలా క్లోజ్‌ ఫ్రెండ్‌. ఆయన చేస్తున్న ఈ సినిమా సూపర్‌హిట్‌ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

సుబ్ర అయ్యప్ప: ఈ సినిమా చేయడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఒక మంచి టీమ్‌తో పనిచేశాను. ఇది నాకు అమేజింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. ఈ టీమ్‌ అంతా ఒక ఫ్యామిలీలా అనిపించింది. అరవింద్‌ మంచి కోస్టార్‌. నాకు అన్నివిధాలా సపోర్ట్‌ ఇచ్చారు. 

నీలమ్‌ ప్రసాద్‌: ఈ సినిమా డైరెక్ట్‌ చెయ్యాలన్న ప్రాసెస్‌లో నేనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ అందరూ ఇది తమ సొంత సినిమాగా భావించి పనిచేశారు. ఒక ఫ్యామిలీలాంటి ఈ టీమ్‌తో మళ్ళీ సినిమా చెయ్యాలని వుంది. అరవింద్‌ నాకు మంచి ఫ్రెండ్‌. అలాగే హీరోయిన్‌ సుబ్ర మా ఫ్యామిలీ ఫ్రెండ్‌. వీరితో ఒక మంచి సినిమా తీశానన్న శాటిస్‌ఫ్యాక్షన్‌ నాకు కలిగింది. రెండు గంటల సేపు ఫ్యామిలీతో చూడదగిన మంచి వినోదాత్మక చిత్రంగా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.

అరవింద్‌ కృష్ణ: ప్రసాద్‌గారు ఈ లైన్‌ చెప్పినపుడు నా ఫ్లాష్‌ బ్యాక్‌ గుర్తొచ్చింది. అయితే ఈరోజు తెలిసింది ఇది ప్రసాద్‌గారి ఫ్లాష్‌బ్యాక్‌ అని. నేను భాస్కరభట్లగారికి ఫ్యాన్‌ని. ఆయన రాసిన పాటల్లో నేను నటించే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశాను. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. జీవన్‌ థామస్‌గారు నాకు చాలా మంచి ఆల్బమ్‌ ఇచ్చారు. తప్పకుండా ఈ పాటలు, సినిమా అందరికీ నచ్చుతాయని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పగలను.

అరవింద్‌ కృష్ణ, సుబ్ర అయ్యప్ప, అశోక్‌కుమార్‌, ప్రభాస్‌ శ్రీను, షఫీ, వైవా హర్ష, సుమన్‌ శెట్టి, భార్గవి, సాధన, మనస్విని, కుముద, ప్రవీణ, జయవాణి, ఎఫ్‌.ఎం. బాబాయ్‌ నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జయపాల్‌రెడ్డి, సంగీతం: జీవన్‌ థామస్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌, డాన్స్‌: నిక్సన్‌, పాటలు: భాస్కరభట్ల రవికుమార్‌, ఆర్ట్‌: మోహన్‌ జెల్లా, ఎగ్జిక్యూటివ్‌ మేనేజర్‌: సూర్యనారాయణ, స్టిల్స్‌: సాయిజ్యోతి, మేకప్‌: నాయుడు, కథ: పురందరేశ్వరి ఫిలింస్‌, స్క్రీన్‌ప్లే: ముకుంద్‌ పాండే, మాటలు: జి.మధుసూదన్‌, నిర్మాత, దర్శకత్వం: ప్రసాద్‌ నీలమ్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ