సరిగ్గా 26 ఏళ్ల క్రితం ఓ కొత్త డైరెక్టర్ రూపొందించిన 'శివ' అనే సినిమా సెన్సెషన్‌గా నిలిచింది. సినిమా స్క్రీన్‌ప్లే కానుంచి మొదలుపెడితే కథ, ఫైట్లు, సాంగ్స్ అన్ని కూడా వినూత్నంగానే కాకుండా జనరంజకంగా కూడి ఉండి ఓ కొత్త ట్రెండ్‌కు నాంది పలికింది. అందుకే 'శివ' విడుదలైన 26 సంవత్సరాలు గడస్తున్నా.. ఇంకా ఆ సినిమాను తలుచుకోకుండా ఉండలేకపోతున్నాం. హీరో నాగార్జునకు ఒక్కసారిగా మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన ఈ సినిమా సీఎన్‌ఎన్-ఐబీఎన్ అత్యుత్తమ వంద చిత్రాల్లో కూడా స్థానం సంపాదించుకుంది. అయితే 'శివ' మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆధునిక సౌబగులు దిద్దుకొని త్రీడీ అనలాగ్ సౌండ్ టెక్నాలజీతో సరికొత్త 'శివ' మే 15న ప్రేక్షకులను పలకరించనున్నాడు.