Advertisementt

కింగ్‌ నాగార్జున ఆవిష్కరించిన ‘దోచేయ్‌’ ఆడియో

Sat 11th Apr 2015 03:31 AM
telugu movie dochay,dochay audio release,naga chaitanya,nagarjuna,sunny mr,sukumar,rajamouli  కింగ్‌ నాగార్జున ఆవిష్కరించిన ‘దోచేయ్‌’ ఆడియో
కింగ్‌ నాగార్జున ఆవిష్కరించిన ‘దోచేయ్‌’ ఆడియో
Advertisement
Ads by CJ

నాగచైతన్య హీరోగా, కృతి సనన్‌ హీరోయిన్‌గా  స్వామిరారా వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన సుధీర్‌వర్మ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రై. లిమిటెడ్‌ పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న విభిన్న చిత్రం ‘దోచేయ్‌’. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ శుక్రవారం హైదరాబాద్‌లోని తాజ్‌ డెక్కన్‌ హోటల్‌లో జరిగింది. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి బిగ్‌ సి.డి.ని ఆవిష్కరించగా, కింగ్‌ నాగార్జున ఆడియో సి.డి.ని ఆవిష్కరించి తొలి సి.డి.ని కీరవాణికి అందించారు. సన్నీ ఎం.ఆర్‌. సంగీత సారధ్యంలో రూపొందిన ఈ ఆడియో లహరి మ్యూజిక్‌ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. ఇంకా ఈ కార్యక్రమంలో నాగచైతన్య, కృతి సనన్‌, సంగీత దర్శకుడు సన్ని ఎం.ఆర్‌., నటులు బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, వైవా హర్ష, రాజా రవీంద్ర, సత్య, ప్రముఖ దర్శకులు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, సుకుమార్‌, కరుణాకరన్‌, హీరో సుశాంత్‌, దర్శకుడు సుధీర్‌వర్మ, చందు మొండేటి, లహరి మ్యూజిక్‌ మనోహర్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..

నాగార్జున: ఆరు నెలల క్రితం సుధీర్‌వర్మను కలిసినపుడు, ఈ కథ విన్నప్పుడు, పోస్టర్స్‌ చూసినపుడు, ఈ పాటలు చూసినపుడు నాకు గుడ్‌ ఫీల్‌ కలిగింది. ఈ ఫంక్షన్‌కి నన్ను ఆహ్వానించడానికి ఉదయం సెట్‌లోకి ప్రసాద్‌గారు వచ్చినపుడు సెట్‌లోని అందరూ ఆయన్ని ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకొని పలకరించారు. ఉదయం చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. ఆయన మంచితనమే ఈ సినిమాకి శ్రీరామరక్ష. ట్రైలర్స్‌ చూశాను. చాలా బాగున్నాయి. మ్యూజిక్‌ ఫెంటాస్టిక్‌గా వుంది. చైతన్యకి, సుధీర్‌వర్మకి, ప్రసాద్‌గారికి ఈ సినిమా మంచి హిట్‌ అవుతుంది. అలాగే సుధీర్‌, నేను కలిసి ఒక సినిమా చేద్దామనుకున్నాం. అది నిజం కావాలని కోరుకుంటున్నాను. 

ఎస్‌.ఎస్‌.రాజమౌళి: ప్రసాద్‌గారు, బాపినీడు సినిమా అంటే ఎంతో ప్యాషన్‌ వున్నవారు. వాళ్ళకి డబ్బులు అనేది సెకండరీ. మంచి సినిమా తియ్యాలని తపన పడుతుంటారు. సుధీర్‌వర్మ స్వామిరారా చిత్రాన్ని బాగా తీశాడు. సినిమా బాగా రావాలన్నా, ఆర్టిస్టుల నుంచి మంచి పెర్‌ఫార్మెన్స్‌ రాబట్టుకోవాలన్నా, బడ్జెట్‌లో సినిమా కంప్లీట్‌ చెయ్యాలన్నా డైరెక్టర్‌కి ఒక క్లారిటీ వుండాలి. సుధీర్‌కి ఆ క్లారిటీ బాగా వుందనిపిస్తుంది. ఈ ట్రైలర్‌ చాలా ట్రెండీగా వుంది. ఈ సినిమా డెఫినెట్‌గా హిట్‌ అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. యూనిట్‌లోని అందరికీ ఆల్‌ ది బెస్ట్‌.

సుకుమార్‌: సుధీర్‌ని చూస్తుంటే నా దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చెయ్యకుండా వెళ్ళిపోయాడే అని బాధగా వుంది నాకు. అతన్ని నా దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా  చేయించుకునే ఛాన్స్‌ మిస్‌ అయిపోయిందే అనిపిస్తుంది నాకు. స్వామిరారా సినిమా చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. నేను కొన్ని సీన్స్‌ తియ్యాలంటే చాలా టెన్షన్‌ పడతాను. కానీ, సుధీర్‌ మాత్రం స్వామిరారా చిత్రాన్ని చాలా కూల్‌గా తక్కువ రోజుల్లోనే మంచి ఔట్‌పుట్‌ ఇచ్చాడు. ‘దోచేయ్‌’ ట్రైలర్‌, పాటలు చాలా ఫెంటాస్టిక్‌గా వున్నాయి. సినిమాని ఎంత బాగా తీసి వుంటాడో ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుందన్న నమ్మకం నాకు వుంది. 

యం.యం.కీరవాణి: సన్ని మ్యూజిక్‌ చేసిన స్వామిరారా పాటలు బాగా ఎంజాయ్‌ చేశాను. ఆ తర్వాత ఉయ్యాల జంపాల, రౌడీఫెలో పాటలు కూడా నచ్చాయి. ఇంతకుముందు పోసానిగారు అన్నట్టు మామూలు జనానికి సంగీతం గురించి తెలీదు. మేధావులు మాత్రమే మేజర్‌ స్కేల్‌లో సాంగ్స్‌ చేసి మెప్పించగలుగుతారు. మైనస్‌ స్కేల్‌లో ఎవరైనా చేస్తారు. మేజర్‌ స్కేల్‌లో సన్ని చేయగలుగుతున్నాడంటే అతనికి హ్యాట్సాఫ్‌. ఈ సినిమా ఘనవిజయం సాధించాలని యూనిట్‌లోని అందరికీ బెస్ట్‌ విషెస్‌ తెలియజేస్తున్నాను. 

బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌: కథని నమ్మి ఈ సినిమా తీశాం. సినిమాకి ఏం కావాలో అవన్నీ చేశాం. గ్యారెంటీగా మంచి సినిమా అవుతుందని, మీ అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

నాగచైతన్య: రెండు వారాల క్రితమే నాలుగు పాటలు సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చెయ్యడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఫస్ట్‌టైమ్‌ నాకు ఇలాంటి ఒక వెర్సటైల్‌ ఆల్బమ్‌ దొరికింది. సన్నికి ఈ సందర్భంగా థాంక్స్‌ చెప్తున్నాను. ఈ ఆల్బమ్‌లో 9 పాటలు వున్నాయి. సినిమాలో పిక్చరైజ్‌ చేసింది నాలుగు పాటలే. మిగతావి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌లా వుంటాయి. అవి కూడా ఆల్బమ్‌లో వుంటే బాగుంటుందనిపించింది. ‘దోచేయ్‌’లో నన్నే కాదు తెలుగు సినిమాని కొత్తగా ప్రజెంట్‌ చేస్తాడు సుధీర్‌. ‘స్వామిరారా’తో ఒక ట్రెండ్‌ సెట్‌ చేశాడు. ‘దోచేయ్‌’తో మరో ట్రెండ్‌ సెట్‌ చేయబోతున్నాడు. నేను చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాను. 

కృతి సనన్‌: ఈ సినిమా చేయడం ఒక ఎమేజింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. యూనిట్‌ మెంబర్స్‌ అందరికీ థాంక్స్‌. యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ నన్ను సపోర్ట్‌ చేశారు. సుధీర్‌వర్మకి చాలా స్ట్రాంగ్‌ విజన్‌ వుంది. తనకి కావాల్సింది ఏమిటో అతనికి తెలుసు. చైతన్య స్పాంటేనియస్‌ కోస్టార్‌. ఈ సినిమాకి వర్క్‌ చేయడం చాలా సంతోషాన్ని కలిగించింది. 

సన్ని ఎం.ఆర్‌.: నా కుటుంబ సభ్యులకు, మా డైరెక్టర్‌కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక మంచి టీమ్‌తో వర్క్‌ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఈ పాటలు బాగా రావడంలో సహకరించిన మా లిరిసిస్ట్స్‌, మ్యూజిషియన్స్‌, టెక్నీషియన్స్‌ అందరికీ థాంక్స్‌. 

సుధీర్‌వర్మ: ఈ సినిమా చేయడానికి నన్ను సపోర్ట్‌ చేసిన ప్రసాద్‌గారికి, బాపినీడుకి, నాగచైతన్య, కృతి సనన్‌కి, యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. ఈ సినిమాకి సన్ని చాలా ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ ఇచ్చాడు. నేను ఎక్స్‌పెక్ట్‌ చేసిన దానికంటే ఎక్కువే ఇచ్చాడు. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నా నమ్మకం. 

నాగచైతన్య సరసన కృతి సనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, రవిబాబు, రావు రమేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్‌., సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌, ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, కెచ్చా కంఫక్డే, విజయ్‌, డాన్స్‌: జానీ, శేఖర్‌, ఆర్ట్‌: నారాయణరెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌ ఈదర, కోప్రొడ్యూసర్‌: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుధీర్‌వర్మ. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ