ధనలక్ష్మి తమ తలుపు తట్టాలని, తలుపు తీసిన మరుక్షణం తమ ఇంట్లోకి విచ్చేసి శాశ్వతంగా తిష్ట వేయాలని ప్రతి ఒక్కరూ కోరుకొంటారు. కానీ.. ‘ధనలక్ష్మి తలుపు తట్టినవేళ...’ ఓ నలుగురు యువకుల జీవితాల్లో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకొన్నాయి? ఆ పరిణామాలు వారితో ఎలా పరుగులు పెట్టించాయి?’ అనే కథాంశంతో.. మాస్టర్ సుక్కురామ్ సమర్పణలో భీమవరం టాకీస్ పతాకంపై అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్‌టైనింగ్ థ్రిల్లర్ నిర్మిస్తున్నారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ. ఆ చిత్రం పేరు ‘ధనలక్ష్మి తలుపు తడితే..!!’ సాయి అచ్యుత్ చిన్నారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ధనరాజ్, మనోజ్‌నందం, రణధీర్, అనిల్ కళ్యాణ్, విజయ్‌సాయి, సింధుతులాని, శ్రీముఖి, నాగబాబు, తాగుబోతు రమేష్, రచ్చరవి, షేకింగ్ శేషు మరియు జబర్దస్త్ బ్యాచ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జనవరిలో ప్రారంభమైన ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ ముగించుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ‘‘కథ`కథనాలు హైలెట్‌గా సాగే ఈ చిత్రంలో కామెడీతోపాటు చాలా ట్విస్టులు, సర్‌ప్రైజులు కూడా ఉంటాయి. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఈ నెలాఖరుకు ఆడియో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.
భోలే శావలి సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: శివ వై.ప్రసాద్, కెమెరామెన్: శివ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ప్రసాద్ మల్లు(యుఎస్‌ఎ)`ప్రతాప్ భీమిరెడ్డి (యుఎస్‌ఎ) సమర్పణ: మాస్టర్ సుక్కురామ్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ`స్క్రీన్‌ప్లే`సంభాషణలు`దర్శకత్వం: సాయి అచ్యుత్ చిన్నారి!!