Advertisementt

‘చంద్రముఖి’ తరహా ‘చంద్రిక’ షూటింగ్‌ పూర్తి

Fri 10th Apr 2015 03:54 PM
chandrika movie,kamna jathmalani,srimukhi,girish karnad   ‘చంద్రముఖి’ తరహా ‘చంద్రిక’ షూటింగ్‌ పూర్తి
‘చంద్రముఖి’ తరహా ‘చంద్రిక’ షూటింగ్‌ పూర్తి
Advertisement
Ads by CJ

సంచలన విజయం సాధించిన ‘చంద్రముఖి’ తరహాలో రూపొందుతున్న హర్రర్‌ డ్రామా ఎంటర్‌టైనర్‌ ‘చంద్రిక’. తెలుగు`కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ‘ఫ్లయింగ్‌ వీల్స్‌ ప్రొడక్షన్స్‌’ పతాకంపై శ్రీమతి వి.ఆశ నిర్మిస్తున్నారు. కార్తీక్‌ జయరామ్‌, కామ్నజెత్మలాని, శ్రీముఖి (‘పేమ ఇష్క్‌ కాదల్‌’ ఫేం) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా పలువురు ప్రముఖ దర్శకుల వద్ద పని చేసిన ‘యోగేష్‌ మునిసిద్దప్ప’ డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్‌ అవుతున్నారు.  ఓ కొత్త జంట ఎంతో అన్యోన్యంగా నివసించే ఓ భవనంలో జరిగే అనూహ్య సంఘటనల సమాహారంగా, సరికొత్త స్క్రీన్‌ప్లేతో తెరకెక్కుతున్న ‘చంద్రిక’.. హైద్రాబాద్‌, మరియు బెంగుళూరులో జరిగిన షెడ్యూల్స్‌తో షూటింగ్‌ పూర్తి చేసుకొంది.

ఈ సందర్భంగా ‘ఫ్లయింగ్‌ వీల్స్‌ ప్రొడక్షన్స్‌’ అధినేత్రి వి.ఆశ మాట్లాడుతూ.. ‘‘భారతీయ సినిమా చర్రితలో ఎన్నటికీ చెరగని ముద్ర వేసిన ‘చంద్రముఖి’ని తలపించేలా.. ‘చంద్రిక’ చిత్రాన్ని మా దర్శకుడు యోగేష్‌ మునిసిద్దప్ప ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. హీరో కార్తీక్‌ జయరామ్‌, హీరోయిన్లు కామ్మజెత్మలాని, శ్రీముఖి ఒకరితో ఒకరు పోటీ పడి నటించారు. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. షూటింగ్‌ పూర్తయ్యింది. గ్రాఫిక్స్‌ వర్క్‌తోపాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. త్వరలో ఆడియో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. 

గిరీష్‌ కర్నాడ్‌, ఎల్‌.బి.శ్రీరాం, తాగుబోతు రమేష్‌, సత్యం రాజేష్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: నాగు, ఎడిటింగ్‌: వి.సురేష్‌కుమార్‌Ñ యాక్షన్‌: ధ్రిల్లర్‌ మంజు, మ్యూజిక్‌: గున్వంత్‌, నిర్మాత: శ్రీమతి వి.ఆశ, కథ`స్క్రీన్‌ప్లే: సాజిద్‌ ఖురేషి, దర్శకత్వం: యోగేష్‌ మునిసిద్దప్ప!!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ