కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని హీరోగా నిఖితారెడ్డి సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో యూత్ హీరో నితిన్ ఓ యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని భారీ ఎత్తున నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 8 అఖిల్ అక్కినేని పుట్టినరోజును పురస్కరించుకొని విడుదల చేసిన ఈ చిత్రం టీజర్‌కి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
ఈ సందర్భంగా నిర్మాత నితిన్ మాట్లాడుతూ ‘‘అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న విడుదల చేసిన ఈ చిత్రం టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. 8వ తేదీ ఉదయం 11 గంటల నుండి 9వ తేదీ ఉదయం 11 గంటల వరకు అంటే 24 గంటల్లో ఈ టీజర్‌కి 3 లక్షల హిట్స్ రావడం చాలా హ్యాపీగా వుంది. వారం రోజుల్లో ప్రేక్షకుల నుంచి, అభిమానుల నుంచి ఇంకా భారీ రెస్పాన్స్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఇప్పటివరకు అభిమానుల నుంచి, ప్రేక్షకుల నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. ఈ సినిమాలో ఆడియన్స్, ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసే అన్ని అంశాలతో సినిమాని చాలా ఎక్స్‌ట్రార్డినరీగా తీస్తున్నారు వినాయక్‌గారు.
సావిల్‌లో అఖిల్
ఈనెల 22 నుంచి ఈ చిత్రానికి సంబంధించి స్పెయిన్‌లోని సావిల్‌లో నెలరోజులపాటు ఒక భారీ షెడ్యూల్‌ను చేయబోతున్నాం. స్పెయిన్ నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో ఒక సాంగ్‌ని సెట్‌లో చిత్రీకరించబోతున్నాం. జూన్‌లో 35 రోజులపాటు యుగాండాలో భారీ షెడ్యూల్ వుంటుంది. వెలిగొండ శ్రీనివాస్, కోన వెంకట్, అనూప్ రూబెన్స్, ఎస్.ఎస్.థమన్, అమోల్ రాథోడ్, ఎ.ఎస్.ప్రకాష్, రవివర్మ వంటి టాప్ టాప్ టెక్నీషియన్స్ ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చెయ్యాలన్న పట్టుదలతో పనిచేస్తున్నారు'' అన్నారు.
అఖిల్ అక్కినేని, సాయేషా సైగల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, మహేష్ మంజ్రేకర్, వెన్నెల కిషోర్, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.