మాస్ కథలను తెరకెక్కించడంలో దర్శకుడు వివి వినాయక్‌ది ప్రత్యేక శైలి. వినాయక్‌పై నమ్మకంతో కుమారుడిని హీరోగా పరిచయం చేసే భాద్యత అతని చేతుల్లో పెట్టారు కింగ్ నాగార్జున. నాగార్జున నమ్మకం వమ్ము కాలేదు. వివి వినాయక్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ఫస్ట్ టీజర్ నేడు (ఏప్రిల్ 8) విడుదల చేశారు. అఖిల్ పుట్టినరోజు కానుకగా విడుదలైన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
టీజర్ హిట్టవడంతో హ్యాపీగా ఉన్న మూవీ యూనిట్, కీలక షెడ్యూల్ చిత్రీకరణ కోసం ఈ నెల 20న యూరోప్ వెళ్తున్నారు. అక్కడ కీలక సన్నివేశాలను తెరకేక్కిస్తారు. పాటలు, ఫైటులతో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తారు. యూరోప్ షెడ్యూల్‌కు ముందు రెండు రోజులు ఈ నెల 13, 14వ తేదీల్లో ముంబైలో షూటింగ్ జరుపుతారు. ఇప్పటికే హైదరాబాద్లో హీరో ఇంట్రడక్షన్ ఫైట్, మరికొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు.
ఈ సినిమాలో అఖిల్ సరసన సాయేషా సైగల్ కథానాయికగా నటిస్తుంది. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో హీరో నితిన్, అతని తండ్రి సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్, అనూప్ రూబెన్స్ సంగీత దర్శకులు.