యంగ్‌టైగర్ ఎన్టీఆర్, ఆర్య సుకుమార్ ఫస్ట్ కాంబినేషన్‌లో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఇండియా లిమిటెడ్ పతాకంపై భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ ఏప్రిల్ 2 నుంచి బార్సిలోనాలో జరుగుతున్నాయి. ఈ మ్యూజిక్ సిట్టింగ్స్‌లో దేవిశ్రీప్రసాద్, సుకుమార్, చంద్రబోస్, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ పాల్గొంటున్నారు.
మే 1 నుంచి లండన్‌లో రెగ్యులర్ షూటింగ్
ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మే 1 నుంచి లండన్‌లో జరగనుంది. ఎన్టీఆర్, సుకుమార్‌ల ఫస్ట్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ వున్నాయి. ఎన్టీఆర్ తాజా చిత్రం ‘టెంపర్’ ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పుడు సుకుమార్ కాంబినేషన్‌లో చేస్తున్న ఈ సినిమాపైనే ఎన్టీఆర్ పూర్తి కాన్‌సన్‌ట్రేషన్ వుంది. ఎన్టీఆర్ ఇమేజ్‌కి తగ్గట్టు వుంటూనే సుకుమార్ స్టైల్‌లో డిఫరెంట్‌గా ఈ చిత్రం రూపొందనుంది.
ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: సుకుమార్.