సెక్సీ సైరన్ నిషా కొఠారి పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘బుల్లెట్ రాణి’. తెలుగు`కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువ ప్రతిభాశాలి సాజిద్ ఖురేషి దర్శకత్వంలో ‘ఫోకస్ ఆన్ పిక్చర్స్’ పతాకంపై ఎం.ఎస్.యూసఫ్ నిర్మిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది.
యాక్షన్ ప్యాక్డ్ మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘బుల్లెట్ రాణి’ చిత్రం గురించి చిత్ర దర్శకుడు సాజిద్ ఖురేషి మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన నిషా కొఠారి డేర్ డెవిల్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న చిత్రమిది. సంఘ విద్రోహశక్తులపై.. ఓ లేడీ గబ్బర్‌సింగ్‌లా ఆమె విరుచుకుపడే తీరు అందర్నీ అమితంగా ఆకట్టుకుంటుంది. హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలింగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ‘గ్లామర్`యాక్షన్`కామెడి’ల కలగలుపుగా రూపొందిస్తున్నాం. తెలుగుతోపాటు, కన్నడలోనూ ఒకేసారి రూపొందుతున్న ఈ మాస్ మసాలా ఎంటర్‌టైనర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది’ అన్నారు.
ఆశిష్ విద్యార్ధి, రవి కాలె (దృశ్యం ఫేం) షఫి, తాగుబోతు రమేష్, అవినాష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: వి.సురేష్‌కుమార్, కాస్ట్యూమ్స్: వెంకట్, ఆర్ట్: నాగు, ప్రెస్ రిలేషన్స్: ధీరజ అప్పాజీ, యాక్షన్: థ్రిల్లర్ మంజు, మ్యూజిక్: గున్వంత్, నిర్మాత: ఎం.ఎస్.యూసఫ్, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: సాజిద్ ఖురేషి !!