విద్యాబాలన్‌కు ఎన్నో రోజులుగా ఓ కోరిక అలాగే మిగిలిపోయిందట. తమిళ్, మళయాలం భాషల్లో నటించాలన్న ఆమె కోరిక తీరే అవకాశం కోసం కొన్నేళ్లుగా ఆమె ఎదురుచూస్తోందట. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్న ఈ సోగసరి సొంత రాష్ట్రం కేరళ. అయితే తమిళ్, మలయాళం భాషల్లో తనకు నటించాలని ఉన్నా అవకాశం దొరకడం లేదంటూ విద్యాబాలన్ వాపోతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో సృజనాత్మక చిత్రాలు ఈ రెండు భాషల్లోనే వస్తాయని, అందుకే ఈ భాషల్లో తనకు నటించాలని ఉందని విద్యా చెబుతోంది. అంతేకాకుండా తమిళంలో కమల్ సార్ సరసన నటించే అవకాశం వస్తే అంతకుమించిన అదృష్టం కూడా లేదని చెబుతోంది. అయితే ఆమె నటించాలనుకుంటున్న చిత్రాల్లో టాలీవుడ్ మూవీ లేకపోవడం తెలుగు ప్రేక్షకులను కాస్త బాధపెట్టే విషయమే. ప్రస్తుతం బాలీవుడ్ ఇమ్రాన్ హష్మీతో కలిసి విద్యాబాలన్ 'హమారి అధూరి కహానీ' చిత్రంలో నటిస్తోంది. మోహిత్‌సూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మహేష్‌భట్ నిర్మిస్తున్నారు.