సూర్యతేజ్, హర్షిక జంటగా జంపా క్రియేషన్స్ పతాకంపై కె.ఆర్.విష్ణు దర్శకత్వంలో ప్రదీప్‌కుమార్ జంపా నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అప్పుడలా ఇప్పుడిలా. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఆదివారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నటి లక్ష్మి మంచు ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యతేజ్, హర్షిక, నరేష్, దర్శకుడు కె.ఆర్.విష్ణు, నిర్మాత ప్రదీప్‌కుమార్ జంపా, సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్, సినిమాటో్గ్రాఫర్ పి.సి.ఖన్నా, కథా రచయిత బ్రహ్మారెడ్డి కమతం, అంబటి శ్రీను, ఫిష్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..
లక్ష్మి మంచుః ట్రైలర్ చాలా ఫన్నీగా వుంది. ఫస్ట్ మూవీ చేసేటపుడు ఎంత టెన్షన్ వుంటుందో నాకు తెలుసు. ఇప్పుడు నేను ప్రతి సినిమా అలాగే ఫీల్ అవుతున్నాను. ఒక మంచి సినిమాను తీసిన టీమ్‌లోని ప్రతి ఒక్కరికీ మనస్పూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను.
నరేష్ః సాఫ్ట్‌వేర్ రంగంలో మంచి పేరుతోపాటు ఎన్నో అవార్డులు సంపాదించుకున్న ప్రదీప్ ఈ సినిమా ద్వారా నిర్మాతగా మారి ఒక మంచి సినిమాను తీశారు. ఇందులో ఒక కీ రోల్ ప్లే చేశాను. చాలా హిలేరియస్ కామెడీ వుంటుంది సినిమాలో. తప్పకుండా మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది.
ప్రదీప్‌కుమార్ జంపాః ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తీశాం. మంచు లక్ష్మిగారిది గోల్డెన్ హ్యాండ్. ఆమె చేతుల మీదుగా మా ట్రైలర్ లాంచ్ చెయ్యాలని రెండు నెలలుగా ఎదురుచూస్తున్నాము. ఈ సినిమాని ఎంతో ప్రౌడ్‌గా రిలీజ్ చేసేంత విషయం వుంది. 10 సంవత్సరాల క్రితం నరేష్‌గారు చేసిన సినిమాల్లో ఎంత కామెడీ వుండేదో ఈ సినిమాలో కూడా అంత కామెడీ ఈ సినిమాలో వుందని ఎడిటర్ ఉద్దవ్ చెప్పారు. ఈ సినిమా తప్పకుండా అందర్నీ ఎంటర్‌టైన్ చేస్తుందన్న నమ్మకం నాకు వుంది.
కె.ఆర్.విష్ణుః మా సినిమాలో నరేష్‌గారు ఫుల్ లెంగ్త్ కామెడీ క్యారెక్టర్ చెయ్యడం చాలా ఎస్సెట్ అయింది. సూర్యతేజ్ ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వరకు అదే ఎనర్జీతో చేశాడు. సునీల్‌గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది.
సునీల్ కశ్యప్ః అందరూ ఎంజాయ్ చేసే సినిమా ఇది. యూనిట్‌లోని అందరూ ఎంతో కష్టపడి చేశారు. మంచి మ్యూజిక్ చేయడానికి స్కోప్ వున్న సబ్జెక్జ్ ఇది. త్వరలో పాటలు రిలీజ్ అవుతాయి. మీ అందరూ విని ఎంజాయ్ చెయ్యండి.
సూర్యతేజ్ః ఈ సినిమా ద్వారా సోలో హీరోగా వస్తున్నాను. లక్ష్మి మంచు గారు ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారంటే సినిమా రిలీజ్ తర్వాత మా నిర్మాతగారికి లక్ష్మీదేవి కటాక్షం కూడా వుంటుందని అనుకుంటున్నాను.
హర్షికః కన్నడలో 15 సినిమాల్లో నటించాను. తెలుగులో ఇది నా మొదటి సినిమా. కన్నడలో నా సినిమాలు చూసి తెలుగులో సినిమా చేయాలని ప్రదీప్‌గారు అడిగారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే తెలుగు ఇండస్ర్టీ చాలా బ్యూటిఫుల్‌గా వుంటుంది. ట్రైలర్ చాలా బాగుంది. మా కెమెరామెన్ ఖన్నాగారు అందర్నీ చాలా బాగా చూపించారు. ఈ సినిమా మీ అందరికీ బాగా నచ్చుతుందని నా నమ్మకం.
సూర్యతేజ్, హర్షికా పూనాచా, సుమన్, నరేష్, సుధ, సంగీత, శివారెడ్డి, పృథ్వీ, సుప్రీత్, ప్రభాస్ శ్రీను, వేణు, సుడిగాలి సుధీర్, ఫిష్ వెంకట్, జోష్ రవి, జబర్దస్త్ రాము, అనంత్, అంబటి శ్రీను, మేల్కొటే, ఫణి, చంటి, మాస్టర్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రానికి కథః బ్రహ్మారెడ్డి కమతం, సంగీతంః సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీః పి.సి.ఖన్నా, పాటలుః చిర్రావూరి విజయ్‌కుమార్, చైతన్యవర్మ, మాటలుః పానుగంటి, జయంత్, ఎడిటింగ్ః ఎస్.బి.ఉద్దవ్, ఫైట్స్ః రామ్ సుంకర, నిర్మాతః ప్రదీప్‌కుమార్ జంపా, స్ర్కీన్‌ప్లే-దర్శకత్వంః కె.ఆర్.విష్ణు.