మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయయుడు దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా ఏస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతోన్న తమిళ చిత్రం ఓకే కన్మణి చిత్రాన్ని తెలుగులో మద్రాస్ టాకీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకాలపై ‘ఓకే బంగారం ’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్ర పాటల విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్ లో ని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జరిగింది. ఈ కార్యక్కరమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వి.వి.వినాయక్ ఆడియో సీడీలను ఆవిష్కరించి సిరివెన్నెల సీతారామశాస్త్రికి అందించారు. సీతారామశాస్త్రి థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఆడియో సోని మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలైంది. ఈ సందర్భంగా...
దిల్ రాజు: ఒక సినిమాకి సంబంధించిన హీరో, హీరియిన్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా జరుగుతున్న ఆడియో వేడుక ఇదేనేమో. వారం రోజుల ముందే నేను పాటలు విన్నాను. ఆడియో వినగానే ఈరోజే, అది కూడా సీతారామశాస్త్రిగారి సమక్షంలో విడుదల చేయాలనుకున్నాను. సఖి, నువ్వు వస్తావని సినిమాలతో డిస్ట్రిబ్యూటర్ అయిన నేను మణిరత్నంగారి అమృత సినిమాని తెలుగులో విడుదల చేసి నిర్మాతగా మారాను. ఆ సినిమా డిజాస్టర్ అయింది. నేను కుంగిపోయాను. అయితే వినాయక్ ఆది సినిమాని ఇచ్చాడు. 15 సంవత్సరాలు తర్వాత ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నాను. ఈ సినిమాని తెలుగులో విడుదల చేయడానికి మణిరత్నంగారిని కలిశాను. కథ చెప్పమటే సినాప్సిస్ ఇచ్చి చదవమన్నారు. చదివి ఐదు నిమిషాల్లోనే సినిమా చేయాలని డిసైడ్ చేసుకున్నాను. ఈ నెల 17న సినిమాని విడుదల చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ సినిమాని ఎంజాయ్ చేస్తారు.
వి.వి.వినాయక్: దిల్ రాజు బ్యానర్ లో మూవీ రిలీజ్ అవుతుంటే నా సొంత బ్యానర్ సినిమాలాగానే ఫీలవుతుంటాను. మణిరత్నంగారికి హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేదు. నా వరకు ప్రతి సీన్ చేసేటప్పుడు మణిరత్నంగారిలా చేయాలని అనుకుంటాను. ట్రైలర్ చాలా బావుంది. తప్పకుండా పెద్ద హిట్టవుతుంది.
సిరివెన్నెల సీతారామశాస్త్రి: ఈ సినిమా ఓ మ్యాజిక్. ఒక మెస్మరిజం. మణిరత్నంగారికి అభిమాని కానివారు ఉండరు. అందుకనే మణిరత్నంగారికి అభిమానులు చాలా ఎక్కువ మంది ఉంటారు. నేను డబ్బింగ్ సినిమాలకు పాటలు రాసి చాలా కాలమైంది. అయితే మణి రత్నంగారు అడగ్గానే కాదనలేకపోయాను. అయితే తమిళ లిప్స్ తో సంబంధం లేకుండా పాటలు రాస్తానని అనడం, దానికి ఆయన ఓకే అనడంతో సినిమాకి పాటలు రాశాను. అందుకే పాటలు తెలుగు పాటలున్నట్లు ఉంటాయి.
వంశీ పైడిపల్లి: నెల రోజులుగా ఈ పాటలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. తమళవెర్షన్ లో, తెలుగు వెర్షన్ లో పాటపాడిన కార్తీక్ తమిల్ తను పాడిన పాట కంటే తెలుగులోనే బాగుందన్నాడు. మణిరత్నం, ఎ.ఆర్.రెహమాన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో మనకు తెలుసు. ఈ సినిమాకి సీతారామశాస్త్రిగారు మంచి యూత్ ఫుల్ సాంగ్స్ రాశారు. సినిమా యూత్ ఫుల్ ట్రీట్ అవుతుంది.
నాని: ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పే అవకాశం రావడం హ్యపీగా ఉంది. ఈ సినిమాలో పనిచేసిన వారందరి కంటే నాకే ఈ సినిమా బెనిఫిట్ అవుతుంది. ఎలాంటి కష్టం పడకుండా నా ఖాతాలో ఓ డబ్బింగ్ సినిమా చేరుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో హీరో దుల్కర్ కి తెలుగులో నేనే డబ్బింగ్ చెప్పాను. ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పడం వల్ల నాకు ఎక్కువ క్రెడిట్ దొరుకుతుంది. నేను మణిరత్నంగారికి పెద్ద అభిమానిని. ఆయన సినిమాలో డబ్బింగ్ చెప్పే అవకాశం రావడం ఆనందంగా ఉంది. చాలా మంచి కథ. ప్రతి ఒకరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది.
సాయిధరమ్ తేజ్: మణిరత్నం, రెహమాన్ కాంబినేషన్ లో పాటల్ని నేను విడుదల చేయడం ఆనందంగా ఉంది. పాటలు చాలా బావున్నాయి. పాటలు విని చాలా ఇన్ స్ఫైర్ అయ్యను. కాన్ఫిడెంట్ పెరిగింది.
నిఖిల్: మణిరత్నంగారి సినిమాలంటే మామూలుగా ఉండవు. ప్రపంచంలో ఎంత మంది దర్శకులున్నా ఆయనకి ఓ ప్రత్యేకత ఉంటుంది. మెంటల్ మదిలో సాంగ్ నా ఫేవరేట్ సాంగ్ సినిమా తప్పకుండా పెద్ద హిట్టవుతుంది.