Advertisementt

మరో డిఫరెంట్‌ మూవీతో రాబోతున్న నిఖిల్‌

Sat 04th Apr 2015 06:26 AM
hero nikhil,nikhil new movie,surya vs surya,saiteja productions   మరో డిఫరెంట్‌ మూవీతో రాబోతున్న నిఖిల్‌
మరో డిఫరెంట్‌ మూవీతో రాబోతున్న నిఖిల్‌
Advertisement
Ads by CJ

‘స్వామిరారా’, ‘కార్తికేయ’, ‘సూర్య వర్సెస్‌ సూర్య’ వంటి వరస హిట్‌ చిత్రాలతో హ్యాట్రిక్‌ సాధించి డిఫరెంట్‌ కాన్సెప్ట్స్‌తో సినిమాలు చేసి సూపర్‌హిట్స్‌ కొడుతున్న హీరోగా పేరు తెచ్చుకుంటున్న యంగ్‌ హీరో నిఖిల్‌ ఇప్పుడు మరో డిఫరెంట్‌ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నారు. సాయితేజ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మాణం జరుపుకోనున్న ఓ విభిన్న చిత్రంలో నిఖిల్‌ హీరోగా నటించనున్నాడు. ఇప్పటివరకు నిఖిల్‌ చేసిన సినిమాలన్నీ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో చేసినవే. ఈ చిత్రం వాటన్నింటికంటే డిఫరెంట్‌గా వుండే సబ్జెక్ట్‌తో చెయ్యబోతున్నారు. ‘కార్తికేయ’ చిత్ర దర్శకుడు చందు మొండేటి ‘సూర్య వర్సెస్‌ సూర్య’ చిత్రానికి మాటలు అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి కూడా చందు రచనా సహకారాన్ని అందించడం విశేషం. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో భారీ తారాగణంతోపాటు, టాలీవుడ్‌లోని టాప్‌ టెక్నీషియన్స్‌ వర్క్‌ చెయ్యబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తామని నిర్మాత సి.హెచ్‌.వి.శర్మ తెలిపారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ