Advertisementt

విడుదలకు ముందు విజయవాడ వెళ్తున్న 'సత్యమూర్తి సన్'!

Fri 03rd Apr 2015 06:17 AM
son of satya murthy,audio success meet,vijayawada,allu arjun,trivikram dsp  విడుదలకు ముందు విజయవాడ వెళ్తున్న 'సత్యమూర్తి సన్'!
విడుదలకు ముందు విజయవాడ వెళ్తున్న 'సత్యమూర్తి సన్'!
Advertisement
Ads by CJ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిస్తున్న 's/o స‌త్య‌మూర్తి' ఏప్రిల్ 9న  అత్య‌ధిక ధియోట‌ర్స్ లొ విడుద‌ల‌వుతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ 's/o స‌త్య‌మూర్తి' చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు.  అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్ నటిస్తున్నారు.ఇటీవ‌లే మ్యూజిక్ డెవిల్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతమందించిన ఆడియో సూప‌ర్‌హిట్ అయ్యింది. ఈ స‌క్స‌స్ ని అభిమానులంద‌రితో పంచుకోవ‌టానికి ఏప్రిల్ 6న విజ‌య‌వాడ‌లో 's/o స‌త్య‌మూర్తి' యూనిట్ అంద‌రూ హ‌జ‌ర‌య్యి గ్రాండ్ గా ఆడియో స‌క్స‌స్‌మీట్ ని నిర్వ‌హిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ" స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్‌ ల కాంబినేష‌న్ తో మా బ్యానర్లో చిత్రీకరించిన 's/o స‌త్య‌మూర్తి' ఏప్రిల్ 9న గ్రాండ్ గా విడుద‌ల‌వుతుంది. దేవిశ్రీప్రసాద్ అందించిన అద్భుతమైన పాటలు ఇప్ప‌టికే సూప‌ర్‌హిట్ అయ్యాయి. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంటున్నాయి. దేవి అందించిన ఆడియోకి తెలుగు ప్రేక్ష‌కులు ఇంత‌టి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టినందుకు ఏప్రిల్ 6న విజ‌య‌వాడ‌లో గ్రాండ్ ఆడియో స‌క్స‌స్‌మీట్ ని నిర్వ‌హిస్తున్నాము. అభిమానుల స‌మక్షంలో జ‌రిగే ఈ కార్య‌క్ర‌మాల‌నికి చిత్ర యూనిట్ అంతా హ‌జ‌ర‌వుతారు.తెలుగు ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. 'మ‌నం బాగున్న‌ప్పుడు లెక్క‌లు మాట్లాడి. క‌ష్టాల్లో వున్న‌ప్పుడు విలువ‌లు మాట్లాడ‌కూడ‌దు' అనే మాట‌తో విలువ‌లే ఆస్తి అని ఎంతో చక్క‌గా ద‌ర్శ‌కుడు చెప్పారు. అంత‌కుమించి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెర్ ఫార్మెన్స్  మ‌రియు ల‌క్ ఈ సినిమాకు హైలైట్ కానుంది. ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ పాత్రలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్, ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంటుంది. అని అన్నారు.

నటీనటులు

అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్,స్నేహ, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్,ఎం.ఎస్.నారాయణ తదితరులు

సాంకేతిక వర్గం

పి.ఆర్‌.వో- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరుశ్రీను

ఆర్ట్ - రవీందర్

కెమెరా - ప్రసాద్ మూరెళ్ల

మ్యూజిక్  - దేవిశ్రీ ప్రసాద్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్

నిర్మాత - రాధాకృష్ణ

స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ