ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా హ్యాట్రిక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘సింహా’ నిర్మాత పరుచూరి కిరీటి యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న పక్కా మాస్ ఎంటర్‌టైనర్ ‘పండగ చేస్కో’. ఒక్క పాట మినహా ఈ చిత్రం షూటింగ్ టోటల్‌గా కంప్లీట్ అయింది.
ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు పరుచూరి ప్రసాద్ మాట్లాడుతూ ‘‘ఇటీవల ఫారిన్‌లో చేసిన షెడ్యూల్‌తో ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈరోజు నుంచి డబింగ్ కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్ నెలాఖరులో సినిమా విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం. రామ్ బాడీ లాంగ్వేజ్‌కి తగినట్టుగా హీరో క్యారెక్టర్ చాలా ఎనర్జిటిక్‌గా వుంటుంది. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ చిత్రానికి థమన్ చాలా ఎక్స్‌లెంట్ మ్యూజిక్ ఇస్తున్నారు. యూత్‌తోపాటు అందర్నీ ఎంటర్‌టైన్ చేసే సినిమా ఇది’’ అన్నారు.
ఎనర్జిటిక్‌స్టార్ రామ్, రకుల్ ప్రీత్‌సింగ్, సోనాల్ చౌహాన్, సాయికుమార్, రావు రమేష్, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, సుప్రీత్, బ్రహ్మాజీ, సుబ్బరాజు, అభిమన్యుసింగ్, వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను, ఫిష్ వెంకట్, తేజస్విని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: అనిల్ రావిపూడి, కెమెరా: ఆర్థర్ విల్సన్, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: రామ్`లక్ష్మణ్, సంగీతం: థమన్ ఎస్.ఎస్, పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి, డాన్స్: రాజు సుందరం, కాస్ట్యూమ్స్: రమేష్, మేకప్: టి.నాగు, చీఫ్ కో`డైరెక్టర్: బి.సత్యం, ప్రొడక్షన్ కంట్రోలర్: యోగానంద్, సమర్పణ: పరుచూరి ప్రసాద్, నిర్మాత: పరుచూరి కిరీటి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపిచంద్ మలినేని.