Advertisementt

ఏప్రిల్‌ నెలాఖరులో ఆర్యన్‌ రాజేష్‌ ‘షికార్‌’

Wed 01st Apr 2015 10:26 AM
telugu movie shikaar,aryan rajesh,monica,shikaar stills,shikaar in april  ఏప్రిల్‌ నెలాఖరులో ఆర్యన్‌ రాజేష్‌ ‘షికార్‌’
ఏప్రిల్‌ నెలాఖరులో ఆర్యన్‌ రాజేష్‌ ‘షికార్‌’
Advertisement
Ads by CJ

ఆర్యన్‌ రాజేష్‌, మోనికా హీరోహీరోయిన్లుగా జోషికా సాయిలక్ష్మి సమర్పణలో భూమిజ సినిమా పతాకంపై రమేష్‌బాబు నిర్మిస్తున్న ‘షికార్‌’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్‌ నెలాఖరులో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. 

ఈ సందర్భంగా నిర్మాత రమేష్‌బాబు మాట్లాడుతూ ‘‘ఈ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ ఇటీవల గోవాలో పూర్తి చేశాం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ నెలాఖరులోనే ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నాం. లవ్‌, కామెడీ, యాక్షన్‌, సెంటిమెంట్‌..ఇలా అన్ని ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అందర్నీ ఆకట్టుకుంటుంది. ఒక కొత్త కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆర్యన్‌ రాజేష్‌ క్యారెక్టర్‌ చాలా డిఫరెంట్‌గా వుంటుంది. ఈ చిత్రానికి జాన్‌ అందించిన సంగీతం చాలా ప్లస్‌ అవుతుంది. పాటలన్నీ ఆడియో పరంగా, విజువల్‌గా కూడా చాలా బాగా వచ్చాయి. ఈ సబ్జెక్ట్‌కి ‘షికార్‌’ అనే టైటిల్‌ హండ్రెడ్‌ సర్సెంట్‌ యాప్ట్‌ అవుతుంది’’ అన్నారు.

ఆర్యన్‌ రాజేష్‌, మోనికా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డా॥ బ్రహ్మానందం, రాజీవ్‌ కనకాల, సుమన్‌శెట్టి, శివశంకర్‌, అమృతం వాసు, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జాన్‌, ఆర్ట్‌: కుశాల్‌ శ్రీనివాస్‌, నిర్మాత: రమేష్‌బాబు, దర్శకత్వం: శ్రీ. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ