Advertisementt

సక్సెస్‌ని సెలబ్రేట్‌ చేసుకుంటున్న ‘రేయ్‌’ యూనిట్‌

Tue 31st Mar 2015 02:35 AM
rey movie,saidharam tej,yvs chowdary,sayami kher,sradha dass,rey movie review  సక్సెస్‌ని సెలబ్రేట్‌ చేసుకుంటున్న ‘రేయ్‌’ యూనిట్‌
సక్సెస్‌ని సెలబ్రేట్‌ చేసుకుంటున్న ‘రేయ్‌’ యూనిట్‌
Advertisement
Ads by CJ

సాయిధరమ్‌తేజ్‌ హీరోగా, సయామీఖేర్‌ హీరోయిన్‌గా, శ్రద్ధా దాస్‌ ఓ ప్రత్యేక పాత్రలో యలమంచిలి గీత సమర్పణలో బొమ్మరిల్లు పతాకంపై వై.వి.యస్‌.చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘రేయ్‌’. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తుండడంతో సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో సక్సెస్‌మీట్‌ని ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్‌. ఈ సక్సెస్‌మీట్‌లో హీరో సాయిధరమ్‌తేజ్‌, దర్శకనిర్మాత వై.వి.యస్‌.చౌదరి, గేయరచయిత చంద్రబోస్‌, నటుడు, సింగర్‌ నోయల్‌, జాని మాస్టర్‌, మాటల రచయిత శ్రీధర్‌ సీపాన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..

వై.వి.యస్‌.చౌదరి:  మేం ఎంతో కష్టపడి ఈ సినిమా చేసిన విషయం తెలిసిందే. ప్రేక్షకులు మా కష్టాన్ని గుర్తించి సినిమాని సక్సెస్‌ చేసినందుకు చాలా ఆనందంగా వుంది. యూత్‌ ఆడియన్స్‌, మాస్‌ ఆడియన్స్‌ ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తూ చూస్తున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న కలెక్షన్స్‌ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోందో చెప్తున్నాయి. సినిమా రిలీజ్‌ రోజు వినాయక్‌గారు ఫోన్‌ చేసి నీ ఫస్ట్‌ సక్సెస్‌ సినిమా రిలీజ్‌ చెయ్యడమే. ఈ సినిమాతో మరో హిట్‌ కొట్టావ్‌ అని అప్రిషియేట్‌ చేశారు. అలాగే దాసరి నారాయణరావుగారు ఫోన్‌ చేసి సినిమాకి అన్నిచోట్ల మంచి టాక్‌ వినిపిస్తోంది. ప్రమోషన్‌ విషయంలో కేర్‌ తీసుకోమని చెప్పారు. ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్‌ చూస్తుంటే నేను చేసిన ‘దేవదాసు’ గుర్తొస్తోంది. ఇలాంటి రెస్పాన్సే ఆ సినిమాకి కూడా చూశాను. ఇక ఈ సినిమాలో చిరంజీవిగారి గోలీమార్‌ సాంగ్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ పాట సినిమాకి వన్‌ ఆఫ్‌ ది హైలైట్స్‌ అని చెప్పొచ్చు. చంద్రబోస్‌గారి పాటలు, చక్రి మ్యూజిక్‌ ఈ సినిమాకి చాలా ప్లస్‌ అయ్యాయి. ఈ చిత్రం కోసం పవనిజం సాంగ్‌ షూట్‌ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పాటకు సెన్సార్‌ పూర్తి చేయించి సినిమాకి జత చేస్తున్నాం. రేపటి నుంచి పవనిజం సాంగ్‌ని చూసి అందరూ చూడొచ్చు. 

సాయిధరమ్‌ తేజ్‌: మా ‘రేయ్‌’ చిత్రానికి అన్ని ఏరియాల నుంచి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. నా పెర్‌ఫార్మెన్స్‌ని ఆడియన్స్‌ అప్రిషియేట్‌ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి నాకు వస్తున్న ప్రతి ప్రశంస వై.వి.యస్‌.చౌదరిగారి వల్లే వస్తోంది. సినిమా మొదలైనప్పటి నుంచి ఆయన నన్ను బాగా సపోర్ట్‌ చేశారు. నాతో మంచి క్యారెక్టర్‌ చేయించారు. ‘రేయ్‌’ అంటే ఆయన నమ్మకం, ఆయన కష్టం. చౌదరిగారి పట్టుదల, కృషి వల్లే ప్రేక్షకులు ఈ సినిమాకి ఇంత పెద్ద విజయాన్ని అందించారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ