Advertisementt

రామ్ 'హరికథ'లో కీర్తి..!

Sun 29th Mar 2015 10:38 AM
ram,harikatha,keerthi suresh,kishore tirumala,ram new movie details  రామ్ 'హరికథ'లో కీర్తి..!
రామ్ 'హరికథ'లో కీర్తి..!
Advertisement
Ads by CJ

'శివమ్' సెకండ్ షెడ్యూల్ ఫినిష్ చేసిన రామ్, రెండు రోజులు విరామం తీసుకుని 'హరికథ' చెప్పడానికి రెడీ అయ్యారు. 'సెకండ్ హ్యాండ్' ఫేం కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరసన కీర్తి సురేష్ కథానాయికగా ఎంపికైంది. ఆమెకు తెలుగులో ఇది రెండవ చిత్రం. సీనియర్ నరేష్ కుమారుడు నవీన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రంలో కీర్తినే కథానాయిక. తొలి చిత్రం విడుదలకు ముందే మరో అవకాశం సొంతం చేసుకుని అందరి దృష్టిలో పడింది.

మార్చి 31 నుండి 'హరికథ' రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం. కథపై రామ్ చాలా ఎగ్జయిటింగ్ గా ఉన్నారు. పీటర్ హెయిన్స్ ఫైట్స్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చిత్రానికి అదనపు ఆకర్షణ. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ