Advertisementt

'రేయ్' ఓపెనింగ్స్‌కు హ్యాపీ: వై.వి.యస్‌.చౌదరి

Sun 29th Mar 2015 10:29 AM
rey movie,rey movie review,saidharam tej,yvs chowdary  'రేయ్' ఓపెనింగ్స్‌కు హ్యాపీ: వై.వి.యస్‌.చౌదరి
'రేయ్' ఓపెనింగ్స్‌కు హ్యాపీ: వై.వి.యస్‌.చౌదరి
Advertisement
Ads by CJ

లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నిర్మించిన వై.వి.యస్‌.చౌదరి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సాయిధరమ్‌తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ కొత్తధనంతో కొత్త బ్యాక్‌డ్రాప్ తో, హాలీవుడ్ స్టైల్లో భారీ బడ్జెట్‌తో నిర్మించిన యూత్ ఫుల్ మ్యూజిక్ ల్ ఎంటర్టైనర్ 'రేయ్'.  సమ్మర్ కర్టెన్ రైజర్ గా  మార్చి 27 న రెండు రాష్ట్రాల్లోని, ప్రపంచవ్యాప్తంగా  విడుదలైన ఈ చిత్రానికి అన్ని ఏరియాలో ఎక్స్‌ట్రార్డినరీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. ఓపెనింగ్స్‌తోపాటు అద్భుతమైన టాక్ తో   హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో రన్‌ అవుతోంది.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత  వై.వి.యస్‌.చౌదరి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ...."మేము ఊహించిన విధంగానే 'రేయ్'  యూత్ ని బాగా ఆకట్టుకుంది.  పబ్లిక్ మధ్యలో వుండి ' రేయ్' సినిమా  చూసాను. సాంగ్స్  కి, డైలాగ్స్ కి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది, బాగా ఎంజాయ్ చేస్తున్నారు.  ప్రపంచవ్యాప్తంగా 27న  విడుదలైన ఈ చిత్రానికి అన్ని ఏరియాలో ఎక్స్‌ట్రార్డినరీ ఓపెనింగ్స్‌ వచ్చాయి.ఇక్కడే కాదు ఓవర్సీస్ లో కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మా బొమ్మరిల్లు బానర్ కి మరో హిట్ ఇచ్చిన ప్రేక్షకులు అందరికి నా ధన్యవాదాలు.ముఖ్యంగా  మెగా అభిమానులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ' రేయ్' విడుదలకు ముందు మేము ప్రకటించిన విధంగానే  పవన్ కళ్యాణ్ కి  ట్రిబ్యూట్ గా మేము రెడీ చేసిన పవనిజాం సాంగ్ ను 'రేయ్' చిత్రం విడుదల అయిన అన్ని థియేటర్స్ లలో  ప్రేక్షకులకు, మెగా అభిమానులకు కానుక గా మార్చి 30న సెన్సార్ పూర్తి చేసి వెనువెంటనే  ఈ  పాటను జత చేయనున్నాం. ఈ పాట మిమ్మల్ని మరింత   అలరిస్తుందని, ఉస్చ్తహ పరుస్తుందని బావిస్తున్నాను." అని అన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ