Advertisementt

గుండెపోటుతో సినీ నిర్మాత మృతి..!!

Sun 29th Mar 2015 10:23 AM
producer,pinniti veera sri ramreddy,death,heart attack  గుండెపోటుతో సినీ నిర్మాత మృతి..!!
గుండెపోటుతో సినీ నిర్మాత మృతి..!!
Advertisement
Ads by CJ

సినీ నిర్మాత పిన్నింటి వీర శ్రీరామ్‌రెడ్డి శనివారం గుండెపోటుతో మృతిచెందారు. శ్రీరామి నవమి రోజు పుట్టిన ఆయన అదే రోజు మృతిచెందారు. ప్రస్తుతం చంద్రమహష్‌ దర్శకత్వంలో 'రడ్‌ అలర్ట్‌' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇవే కాకుండా మరో రెండు ప్రాజెక్టులను కూడా నిర్మించడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. వరంగల్‌ జిల్లా జనగాం సమీపంలోని నెల్లుట్ల గ్రామానికి చెందిన శ్రీరామ్‌రెడ్డి సినిమాలపై ఉన్న మక్కువతో సినీ నిలయం క్రియేషన్స్‌ను ప్రారంభించారు. ఇక తొలి ప్రయత్నంగా తన తనయుడు మహదేవ్‌ హీరోగా 'రెడ్‌ అలర్ట్‌'ను నిర్మిస్తున్నారు. మరోవైపు దర్శకుడు వంశీతో కూడా ఓ సినిమా నిర్మించడానికి ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. దీనికి సంబంధించి ఇటీవలే ఇళయరాజా మ్యూజిక్‌ డైరెక్షన్‌లో పలు పాటలను కూడా రికార్డ్‌ చేశారు. అంతేకాకుండా ఓ నూతన దర్శకుడితో 'ఈ సినిమా సూపర్‌హిట్‌ గురూ' అనే చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. శ్రీరామ్‌ రెడ్డి మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ