సోనాక్షిసిన్హాకు తండ్రిగా శత్రుఘ్నసిన్హ నటిస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. అవును ఇది నిజం. తొలిసారి శత్రఘ్నసిన్హ, తన కూతురు నటిస్తున్న సినిమాలో కనిపించనున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో సోనాక్షి కథానాయికగా ‘అఖీరా’ సినిమా తెరకెక్కనుంది. ఇటీవల మురుగదాస్ శత్రుఘ్నను కలిసి కథ చెప్పి, సోనాక్షికి తండ్రి పాత్ర పోషించాలని అడిగినప్పుడు ఆయన అంగీకరించారట. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. సోనాక్షి చిన్నతనంలోనే తన తండ్రి మరణించే పాత్ర శత్రుఘ్న చెయ్యబోతున్నారు. ఆయనకున్న సీన్స్ అన్నీ ఛైల్డ్ ఆర్టిస్ట్‌తోనేనట. ‘‘నేను, నాన్న ఒకే సినిమాలో నటించబోతుండడం ఆనందంగా ఉంది. ఇద్దరికీ ఒక్క సీన్ కూడా లేకపోవడం కాస్త బాధగా ఉంది. అయితే సినిమా చిత్రీకరణలో నాన్న సలహా సూచనలు నాకెంతో ఉపయోగపడతాయి. ఆ తృప్తి చాలు నాకు’’ అని చెప్పుకొచ్చింది సోనాక్షి.