Advertisementt

ఫైనల్‌ మిక్సింగ్‌లో ‘రాజమండ్రికి 50 కి.మీ. దూరంలో’

Wed 25th Mar 2015 08:31 AM
rajahmundryki 50 km dooram lo,vijay surya,hemanth,nairuthi  ఫైనల్‌ మిక్సింగ్‌లో ‘రాజమండ్రికి 50 కి.మీ. దూరంలో’
ఫైనల్‌ మిక్సింగ్‌లో ‘రాజమండ్రికి 50 కి.మీ. దూరంలో’
Advertisement
Ads by CJ

నిషాంత్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై బేబి నిత్యహాసిని సమర్పణలో వి.జ్యోతి నిర్మిస్తున్న చిత్రం ‘రాజమండ్రికి 50 కి.మీ. దూరంలో’. విజయ్‌సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. హేమంత్‌, నైరుతి హీరో హీరోయిన్లు. ఈచిత్రం ప్రస్తుతం షూటింగ్‌ పూర్తి చేసుకుని ఫైనల్‌ మిక్సింగ్‌ జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా దర్శకుడు విజయ్‌సూర్య మాట్లాడుతూ... ‘రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ పూర్తి చేశాం. రాజమండ్రికి 50 కిలోమీటర్ల దూరంలో ఏం జరిగింది అన్న అంశాన్ని లవ్‌, సస్పెన్స్‌తో మేళవించి అందర్నీ ఆకట్టుకునేలా రూపొందించాం.  ఈ చిత్రం ద్వారా నూతన నటీనటులను పరిచయం చేస్తున్నాం. కథానుసారం ఇందులో ఒక పాట ఉంటుంది. దీన్ని ఆకాష్‌ స్వరపరిచారు. ప్రస్తుతం ఫైనల్‌ మిక్సింగ్‌ జరుపుతున్నాం. త్వరలో ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.

ఈ చిత్రానికి ఎడిటింగ్‌: రామారావు జెపి, సంగీతం: ఆకాష్‌, కెమెరా: కుమరన్‌, నిర్మాత: వి. జ్యోతి, దర్శకత్వం: విజయ్‌సూర్య. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ