Advertisementt

ఏప్రిల్‌ 3న ‘దోచేయ్‌’ ఆడియో

Wed 25th Mar 2015 08:25 AM
telugu movie dochey,naga chaitanya,kriti senon,sudheer varma,sunny m.r.,dochey audio on 3rd april   ఏప్రిల్‌ 3న ‘దోచేయ్‌’  ఆడియో
ఏప్రిల్‌ 3న ‘దోచేయ్‌’ ఆడియో
Advertisement
Ads by CJ

ఏమాయ చేసావె, 100% లవ్‌, తడాఖా, మనం వంటి సూపర్‌హిట్‌ చిత్రాల హీరో యువసామ్రాట్‌ నాగచైతన్య కథానాయకుడిగా, 1 నేనొక్కడినే ఫేం కృతి సనన్‌ హీరోయిన్‌గా, స్వామిరారా వంటి సూపర్‌హిట్‌ చిత్రానికి దర్శకత్వం వహించిన సుధీర్‌వర్మ దర్శకత్వంలో అత్తారింటికి దారేది వంటి ఇండస్ట్రీ హిట్‌ని నిర్మించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ‘దోచేయ్‌’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆడియోను ఏప్రిల్‌ 3న గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. 

ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘మార్చి 28 నుంచి ఏప్రిల్‌ 1 వరకు ఈ చిత్రంలోని పాటలను రోజుకి ఒక్కొక్కటి చొప్పున రిలీజ్‌ చెయ్యబోతున్నాం. అలాగే ఏప్రిల్‌ 2న ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్‌ వీడియోను విడుదల చేస్తున్నాం. ఏప్రిల్‌ 3న లహరి మ్యూజిక్‌ ద్వారా ఆడియోను రిలీజ్‌ చేయబోతున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్‌ 17న సమ్మర్‌ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేస్తున్నాం. సినిమా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. నాగచైతన్య కెరీర్‌లో మరో బిగ్గెస్ట్‌ హిట్‌గా ‘దోచేయ్‌’ నిలుస్తుంది. అలాగే మా బేనర్‌కి మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది’’ అన్నారు. 

యువసామ్రాట్‌ నాగచైతన్య సరసన కృతి సనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, రవిబాబు, రావు రమేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్‌., సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌, ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, కెచ్చా కంఫక్డే, విజయ్‌, డాన్స్‌: జానీ, శేఖర్‌, ఆర్ట్‌: నారాయణరెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌ ఈదర, కో`ప్రొడ్యూసర్‌: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుధీర్‌వర్మ. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ