Advertisementt

వైవిఎస్ సినిమాకి 41 కట్లు మాత్రమే..!!

Wed 25th Mar 2015 04:54 AM
rey movie on 27 march,sai dharam tej,sayami kher,shraddha das,rey movie  వైవిఎస్  సినిమాకి 41 కట్లు మాత్రమే..!!
వైవిఎస్ సినిమాకి 41 కట్లు మాత్రమే..!!
Advertisement
Ads by CJ

వైవి ఎస్ చౌదరి దర్శక నిర్మాతగా సాయి ధరమ్ తేజ్, శ్రద్ధదాస్, సయామీ ఖేర్ నటించిన 'రేయ్' సినిమా ఏళ్ళ తరబడి వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఈ  నెల 27ల విడుదల చేస్తున్నారు. ఇటీవల సెన్సార్ పూర్తయింది. ఇక్కడో విశేషం కూడా ఉందండోయ్. ఎంత "ఏ" రేటెడ్ సినిమాకైనా మహా ఐతే 10 నుంచి 15 కట్స్ ఉంటాయి. లేదంటే ఇబ్బంది కరంగా ఉన్న సన్నివేశాల్ని తొలగించడం జరుగుతుంది. కాని వైవిఎస్ కాస్త ప్రత్యేకం కాబట్టి మాటలు, సన్నివేశాలు కలిపి 41 కట్స్ తో సెన్సార్ బోర్డు క్లీన్ "ఏ" సర్టిఫికేట్ ఇచ్చింది. మహిళ ల పై వున్న అసభ్య మాటలన్నిటికి  కత్తిరింపు  జరిగి పోయింది. అయినప్పటికీ సినిమాకు ఏ సర్టిఫికేట్ ఫైనల్ చేసారు. 


ఇక ప్రమోషన్ విషయం లో వైవి ఎస్ కొంచెం డిఫరెంట్ అనే విషయం కొత్తగా ఏమి చెప్పవసరం లేదు. సినిమాకు ప్లస్ అవుతుంది అనుకొనే ఏ సోర్స్ వదలడం లేదు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీని బాగా వాడేసుకుంటున్నాడు. వేదిక దొరికితే చాలు పొగడ్తల వర్షం కురిపించేస్తున్నాడు. ఇక ఈ సినిమా పట్టాలెక్కడానికి ముఖ్య కారణం అయిన పవన్ కళ్యాణ్  మీదయితే పవనిజం అనే ఓ పాటను ఇటీవల స్టార్ట్ చేసాడు. అది పూర్తి కాకపోతే సినిమా రిలీజ్ అయిన రెండు రోజులకి సినిమాకి జత చేస్తారట. మూడు నిమిషాల పాట కోసం ఆ పాట షూటింగ్ స్టార్ట్ కాకముందే  ప్రమోషన్ లో భాగంగా ఓ ప్రెస్ మీట్ పెట్టి మూడేళ్ళ ఈ సినిమా ప్రయాణాన్ని చెప్పిందే చెప్పి సింపుల్ గా ఓ గంటలో అతని ప్రసంగాన్ని ముగించేసాడు. ఇలా రకరకాలుగా వైవిఎస్ ప్రొమోషన్ చేస్తున్నాడు. మరి సినిమా ఎలా ఉండభోతుందో తెల్సుకోవాలంటే మరో మూడు రోజులు వేచి చూడాల్సిందే. అయితే సినిమాకు ఓపెనింగ్స్ బావుంటాయని ఫిలిం నగర్ టాక్.

rey movie on 27 march,sai dharam tej,sayami kher,shraddha das,rey movie
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ