Advertisementt

స్వాతి కథానాయికగా 'త్రిపుర'!

Tue 24th Mar 2015 08:56 AM
tripura,swathi,colors swathi tripura,swathi new movie tripura  స్వాతి కథానాయికగా 'త్రిపుర'!
స్వాతి కథానాయికగా 'త్రిపుర'!
Advertisement
Ads by CJ

కథాబలం ఉన్న చిత్రాలు, నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేస్తూ, మంచి నటి అనిపించుకుంది స్వాతి. తెలుగులో అష్టా చెమ్మా, గోల్కొండ హై స్కూల్, స్వామి రారా, కార్తీకేయ తదితర చిత్రాలతో వరుస విజయాలు చవి చూస్తోంది. మరోవైపు తమిళ, మలయాళ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ, అక్కడ కూడా మంచి నటి అనిపించుకుంది. పాత్రల ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్న స్వాతి ప్రస్తుతం 'త్రిపుర' అనే చిత్రంలో కథానాయికగా నటించడానికి అంగీకరించింది. స్వాతి, పావని సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 'గీతాంజలి' ఫేం రాజ కిరణ్ దర్శకత్వం వహించనున్నారు.

దర్శకుడు రాజ కిరణ్ మాట్లాడుతూ - ''ఏప్రిల్ 6న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరపనున్నాం. అదే నెల 13 నుంచి 25 వరకు తొలి షెడ్యూల్ జరుపుతాం.. ఓ శక్తిమంతమైన కథాంశంతో రూపొందించనున్న ఈ చిత్రంలో స్వాతిది టైటిల్ రోల్. ఇలాంటి జానర్ సినిమా ఇప్పటివరకూ స్వాతి చేయలేదు. తనది అద్భుతమైన పాత్ర. నటిగా తనలోని మరో మంచి కోణాన్ని ఆవిష్కరించే చిత్రం అవుతుంది'' అని చెప్పారు.

ఈ చిత్రానికి మాటలు: రాజా, స్ర్కీన్ ప్లే: శ్రీనివాస్ వెలిగొండ, సంగీతం: కమ్రాన్, కెమెరా: రవికుమార్ సానా, నిర్మాతలు: ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్, రచన-దర్శకత్వం: రాజ కిరణ్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ