Advertisementt

‘మార్గం’ మూవీ పోస్టర్‌ లాంచ్‌

Tue 24th Mar 2015 06:22 AM
telugu movie margam,vinay,bhavana,lekha washington,r.kannan,margam on april 3  ‘మార్గం’ మూవీ పోస్టర్‌ లాంచ్‌
‘మార్గం’ మూవీ పోస్టర్‌ లాంచ్‌
Advertisement
Ads by CJ

వినయ్‌, భావన, లేఖా వాషింగ్టన్‌, సంతానం ప్రధాన పాత్రల్లో ఆర్‌.కణ్ణన్‌ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ‘జయమ్‌ కొండాన్‌’ చిత్రాన్ని సత్యదేవా పిక్చర్స్‌ పతాకంపై ‘మార్గం’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు నిర్మాత సత్యనారాయణ. ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్‌ లాంచ్‌ మంగళవారం హైదరాబాద్‌లోని ఫిలింఛాంబర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు సాగర్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, టి.ప్రసన్నకుమార్‌, నిర్మాత సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా..

పరుచూరి వెంకటేశ్వరరావు: సత్యనారాయణ నాతో కలిసి కొన్ని సినిమాలకు పని చేసాడు. ఆయన ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. ‘మార్గం’ మంచి విజయాన్ని సాధించి సత్యనారాయణకు మంచి లాభాలు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను.

సాగర్‌: ఈ సినిమా అందరికీ నచ్చే అని ఎలిమెంట్స్‌ వున్నాయి. ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఈ సినిమా ఖచ్చితంగా ఘనవిజయం సాధిస్తుంది. 

టి.ప్రసన్నకుమార్‌: తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన నటీనటులు ఈ సినిమాలో నటించడం వల్ల తప్పకుండా ఆడియన్స్‌కి రీచ్‌ అవుతుంది. తమిళంలో పెద్ద విజయం సాధించిన ఈ సినిమా తెలుగులోనూ విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. 

సత్యనారాయణ: ఒక మంచి కాన్సెప్ట్‌తో చేసిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకంతో వున్నాం. ప్రేక్షకుల్ని అలరించే అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఈ సినిమాలో వున్నాయి. తమిళ్‌లో 100 రోజులు ఆడిన ఈ సినిమా ఏప్రిల్‌ 3న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని ఆదరించి ఘనవిజయం చేకూరుస్తారన్న నమ్మకం నాకు వుంది. 

వినయ్‌, భావన, లేఖా వాషింగ్టన్‌, కిషోర్‌, సంతానం, వివేక్‌, శరణ్య మోహన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: వెంకట్‌ మల్లూరి, సంగీతం: విద్యాసాగర్‌, ఫోటోగ్రఫీ: బాలసుబ్రహ్మణ్యం, కథ, దర్శకత్వం: ఆర్‌.కణ్ణన్‌.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ