బలరామ ఆర్ట్స్ పతాకం పై పరకోటి బాలాజీ దర్శకత్వం వహిస్తూ బి.బలరామ ప్రసాద్ తో కలిసి నిర్మిస్తున్న చిత్రం 'పల్లవితో చరణ్'. ఈ చిత్రంలో కార్తికేయ సిద్ధార్ద్ , సాధ్విక హీరో హీరోయిన్ గా నటించారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ శ్రీరామ నవమి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం గురించి దర్శకుడు పరకోటి బాలాజీ మాట్లాడుతూ "ఇటివలే విడుదలైన ఆడియో కి ,ప్రచార చిత్రాలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈ ప్రేమకథను శ్రీరామ నవమి కానుకగా విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది."అన్నారు.
ఈ చిత్రం మరో 'జయం' లా మంచి విజయం సాధించి మా అందరికి గొప్ప పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నాను"అన్నారు. సినిమా మ్యూజికల్ గా హిట్ అయ్యినందుకు ఎంతో సంతోషంగా ఉందని హీరో కార్తిక్ సిద్ధార్ద్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా :అనుదీప్ నాయక్, సంగీతం:గోరంట్ల కృష్ణ,మురళి లియోన్.