రవివర్మ, కిషోర్, సంకీర్త్, వ్రితి ఖన్నా, మమత రహుత్ ప్రధాన పాత్రల్లో గోల్డెన్ టైమ్ పిక్చర్స్ పతాకంపై పన్నా రాయల్ దర్శకత్వలో అనూద్ నిర్మించిన హార్రర్ థ్రిల్లర్ ‘కాలింగ్‌బెల్’. ఉగాది కానుకగా శనివారం విడుదలైన ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్‌తోపాటు అందరి నుంచి సినిమా బాగుంది అనే ప్రశంసలు అందుతున్న నేపథ్యంలో ఆదివారం ఈ చిత్రానికి సంబంధించి సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ఈ సక్సెస్‌మీట్‌లో రవివర్మ, సంకీర్త్, వ్రితి ఖన్నా, మమత రహుత్, నరేష్ కావేటి, చిత్ర దర్శకుడు పన్నా రాయల్, నిర్మాత అనూద్, హేమాస్ మీడియా అధినేత కె.సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..
పన్నా రాయల్: నిన్న ఉగాది రోజున ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో ఆడియన్స్ మధ్య సినిమా చూశాము. చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక్కడే కాదు రెండు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాలో ఎక్స్‌ట్రార్డినరీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈరోజు కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతోంది. సింగిల్‌గా వెళ్ళినవాళ్ళు మళ్ళీ ఫ్యామిలీస్‌తో సినిమా చూడడానికి వెళ్తున్నారు. ఈ పండగకి ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ మంచి సినిమా ఇది అని అందరూ చెప్తున్నారు. మా సినిమాకి ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
రవివర్మ: నేను ఈ సినిమాని మూడోసారి చూసినా కొన్ని సీన్స్‌లో నాక్కూడా భయం అనిపించింది. ఆడియన్స్ కూడా సినిమా చూసి ఎంతో థ్రిల్ అవుతున్నారు. చూసినవాళ్ళు మళ్ళీ మళ్ళీ ఈ సినిమా చూస్తారని నా నమ్మకం. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు ఆడియన్స్‌ని థ్రిల్ చేసే అంశాలు ఈ చిత్రంలో చాలా వుండడం వల్ల సినిమా జనంలోకి వెళ్ళింది.
మమత రహుత్: ఈ సినిమాలో విశాలి క్యారెక్టర్ చేశాను. రెండు షేడ్స్ వున్న డిఫరెంట్ క్యారెక్టర్ నాది. థియేటర్‌లో ప్రేక్షకుల మధ్య వారి సూపర్ రెస్పాన్స్ మధ్య సినిమా చూస్తుంటే చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఈ సినిమా ఇంత మంచి విజయాన్ని సాధించినందుకు మా టీమ్ అంతా ఎంతో హ్యాపీగా వున్నాం. కాలింగ్ బెల్ 2 ఎప్పుడు చేస్తున్నారని అందరూ అడుగుతున్నారు. పార్ట్ 2 చెయ్యడానికి మీరు ఇచ్చే ఎంకరేజ్‌మెంట్ మాకెంతో ఉపయోగపడుతుంది.
వ్రితి ఖన్నా: సినిమాకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత పన్నా రాయల్‌గారు కాలింగ్‌బెల్ సిరీస్ చెయ్యాలని కోరుకుంటున్నాను.
అనూద్: సినిమా మీద మాకు మొదటి నుంచీ చాలా నమ్మకం వుంది. హార్రర్ ఎంటర్‌టైనర్స్‌ని ఆడియన్స్ బాగా ఆదరిస్తారని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ చేశారు. ఒక మంచి సినిమా తీశామన్న తృప్తి మా అందరికీ వుంది. వస్తున్న రెస్పాన్స్‌ని దృష్టిలో పెట్టుకొని రేపటి నుంచి థియేటర్స్ కూడా పెంచుతున్నాం. ఈ ఎంకరేజ్‌మెంట్‌తో కాలింగ్ బెల్2 చెయ్యడానికి మా యూనిట్‌కి మరింత ఉత్సాహం వచ్చింది.
సంకీర్త్: ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు.
నరేష్: ఒక గెస్ట్ హౌస్‌లో ఏం జరిగింది అన్నది కథాంశంగా చాలా అద్భుతంగా తెరకెక్కించారు పన్నా రాయల్. హార్రర్ మూవీలో మ్యూజిక్‌కి ఎంత ఇంపార్టెన్స్ వుంటుందో మీ అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి చాలా అద్భుతమైన మ్యూజిక్ చేశారు సుకుమార్‌గారు. సినిమాకి మ్యూజిక్ బాగా ప్లస్ అయింది.
కె.సురేష్‌బాబు: ఈ సినిమా తప్పకుండా పెద్ద సక్సెస్ అవుతుందని ఆడియో ఫంక్షన్‌లోనే చెప్పాను. ఎందుకంటే అంతకుముందే నేను ట్రైలర్స్ చూశాను. డెఫినెట్‌గా ఆడియన్స్‌కి రీచ్ అయ్యే సినిమా అని ఆరోజే అనుకున్నాను. ఈ ఉగాదికి మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ కొట్టిన ఈ టీమ్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక టీమ్ వర్క్‌తో ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయింది. ఈ సక్సెస్ రేంజ్ ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను.