సినీ నటుడు, హిందూపూర్ ఎం ఎల్ ఏ నందమూరి బాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాతలయ్యారు. మన్మథ నామ సంవత్సర ఉగాది పర్వ దినాన సాయంత్రం 4:18 నిమిషాలకు నారా లోకేష్ భార్య బ్రాహ్మణి కాంటినెంటల్ ఆసుపత్రిలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. మనవడు పుట్టాడనే వార్తతో నారా కుటుంబం, నందమూరి కుటుంబాల్లో పండగ వాతావరణం నెలకొంది. పండగ రోజున మనవడు పుట్టాడనే మరో పండగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ మీడియాకు తెలిపారు. ఆడ బిడ్డా, మగ బిడ్డా అనే తేడాలు మాకు లేవని, ఏ బిడ్ద అయిన ఒకటేనని బాలకృష్ణ అన్నారు.