Advertisementt

‘365 డేస్‌’ ట్రైలర్‌ లాంచ్‌

Sun 22nd Mar 2015 06:15 AM
ramgopal varma,365 days,365 days trailer launch  ‘365 డేస్‌’ ట్రైలర్‌ లాంచ్‌
‘365 డేస్‌’ ట్రైలర్‌ లాంచ్‌
Advertisement
Ads by CJ

నందు, అనైక, పోసాని, కృష్ణుడు ముఖ్యపాత్రల్లో డి.వి. సినీ క్రియేషన్స్‌ పతాకంపై రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో డి.వెంకటేష్‌ నిర్మిస్తున్న చిత్రం ‘365 డేస్‌’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ లాంచ్‌ ఆదివారం హైదరాబాద్‌లోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో రామ్‌గోపాల్‌వర్మ, అనైక, సిరాశ్రీ, నాగ్‌ శ్రీవాత్సవ, డాన్స్‌మాస్టర్‌ విజయ్‌, సినిమాటోగ్రాఫర్‌ అనిత్‌, ఎడిటర్‌ అన్వర్‌ఆలీ, కోరైటర్‌ వైదేహి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..

రామ్‌గోపాల్‌వర్మ: ప్రతి మనిషికి పెళ్ళయిన తర్వాత ఎన్నో రకాల ఎమోషన్స్‌ కలుగుతాయి. నా ఫ్రెండ్‌ ఒకడు ఏడేళ్ళు ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. పెళ్లయిన కొన్ని రోజులకే పెళ్ళంటే నరకం అని చెప్పాడు. ఇది నాకు వచ్చిన ఐడియా కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎదురయ్యేదే. 

నాగ్‌ శ్రీవాత్సవ: నా కాలేజ్‌ టైమ్‌లో నేను శివ సినిమాకి పెద్ద ఫ్యాన్‌ని. ఆ సినిమాలోని పాటలను ఫ్లూట్‌తో పెర్‌ఫార్మ్‌ చేసేవాడిని. ఈ సినిమాకి మ్యూజిక్‌ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మంచి మ్యూజిక్‌ చేయడానికి స్కోప్‌ వున్న సినిమా ఇది.

అనైక: వర్మగారితో నేను చేస్తున్న రెండో సినిమా ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. నందు చాలా మంచి కోస్టార్‌. ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్‌ని క్యారీ చేస్తూ మంచి రొమాన్స్‌ వుంటుంది. 

సిరాశ్రీ: నాగ్‌తో కలిసి ప్రైవేట్‌ ఆల్బమ్‌లకు పనిచేశాను. ఈ సినిమా విషయానికి వస్తే వర్మగారి సినిమాకు డిఫరెంట్‌ పాటలు రాసే అవకాశం వచ్చింది. మాఫియా, దెయ్యాలు అంటూ సినిమాలు తీసే వర్మ ఈ సినిమాలో భార్యాభర్తల మధ్య వుండే ఎమోషన్స్‌ను కూడా మాఫియాలా చూపించారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ