యామిని భాస్కర్, జ్వాల కోటి, ప్రధాన పాత్రల్లో గౌతమి టాకీస్ పతాకంపై ఎన్.వి.బి.చౌదరి దర్శకత్వంలో కిశోర్‌కుమార్ పర్వతరెడ్డి నిర్మిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘కీచక’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ శనివారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్, పటాస్ దర్శకుడు అనిల్ రావిపూడి, యామిని భాస్కర్, జ్వాల కోటి, దర్శకుడు ఎన్.వి.బి.చౌదరి, నిర్మాత కిశోర్‌కుమార్ పర్వతరెడ్డి, సంగీత దర్శకుడు జోశ్య భట్ల, కోడైరెక్టర్ రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
తమ్మారెడ్డి భరద్వాజ: ఈ చిత్ర దర్శకుడు చౌదరి నాగభైరవ కోటేశ్వరరావుగారి అబ్బాయి అని చెప్పగానే మొదట షాక్ అయ్యాను. తను మిణుగురులు చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించాడు. అతని స్క్రీన్‌ప్లే లేకపోతే ఆ సినిమాకి అంత పేరు వచ్చేది కాదు. అతను ఈ సినిమా ద్వారా డైరెక్టర్ పరిచయం కావడం చాలా హ్యాపీగా వుంది.
ఎన్.శంకర్: చౌదరితో నాకు ఏడెనిమిది సంవత్సరాలుగా పరిచయం వుంది. అతను నేను డైరెక్ట్ చేసిన ‘జై బోలో తెలంగాణ’ చిత్రానికి కూడా స్క్రీన్‌ప్లేలో కొంత హెల్ప్ చేశాడు. ఈ ట్రైలర్ చూస్తుంటే చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వుంది. తప్పకుండా చౌదరికి ఈ సినిమాతో డైరెక్టర్‌గా చాలా మంచి పేరు వస్తుంది.
ప్రభు: ఈ సినిమాకి సంబంధించి అన్ని విషయాలు నాకు తెలుసు. చాలా మంచి కథ. తప్పకుండా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే సినిమా. చౌదరికి స్క్రీన్‌ప్లే మీద మంచి పట్టు వుంది. అందుకే చాలా కథలకు ట్రీట్‌మెంట్ ఇస్తున్నాడు. అతను డైరెక్టర్‌గా ఈ సినిమాని చాలా బాగా తీసి వుంటాడనుకుంటున్నాను.
అనిల్ రావిపూడి: నేను కూడా నా పటాస్ చిత్రానికి చౌదరిగారితో ట్రీట్‌మెంట్ చేయించుకున్నాను. చౌదరిగారు చేసిన ఫస్ట్ మూవీ ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కూడా బాగుంటుందని నా నమ్మకం.
ఏప్రిల్‌లో విడుదల కానున్న ఈ చిత్రంలో యామిని భాస్కర్, జ్వాల కోటి, రఘుబాబు, గిరిబాబు, రోజ, అప్పారావు, హరిబాబు, వినోద్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డా॥ జోశ్యభట్ల, కెమెరా: కమలాకర్, కోడైరెక్టర్: రామస్వామి, మాటలు: రామ్‌ప్రసాద్ యాదవ్, ఎడిటింగ్: రాంబాబు మేడికొండ, నిర్మాత: కిశోర్‌కుమార్ పర్వతరెడ్డి, దర్శకత్వం: ఎన్.వి.బి.చౌదరి.