కాళిదాసు, కరెంట్, అడ్డా చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన యంగ్ హీరో సుశాంత్ కథానాయకుడిగా సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో శ్రీG ఫిలింస్ పతాకంపై ప్రముఖ నిర్మాతలు చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నిర్మిస్తున్న భారీ చిత్రం షూటింగ్ ఉగాది పర్వదినాన అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభమైంది. కింగ్ నాగార్జున పూజా కార్యక్రమాలు నిర్వహించి స్క్రిప్ట్‌ను దర్శకుడు నాగేశ్వరరెడ్డికి అందించారు. నాగచైతన్య క్లాప్‌నివ్వగా, అఖిల్ అక్కినేని కెమెరా స్విచ్చాన్ చెయ్యగా, సుమంత్ తొలి షాట్‌కి దర్శకత్వం వహించగా హీరో సుశాంత్ ‘అందరికీ ఉగాది శుభాకాంక్షలు’ అన్న డైలాగ్ చెప్పడాన్ని ముహూర్తం షాట్‌గా చిత్రీకరించారు.
ఏప్రిల్ 10 నుండి రెగ్యులర్ షూటింగ్
నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘‘వరసగా మూడు హిట్స్ తర్వాత సుశాంత్‌తో చేస్తున్న నాలుగో సినిమా ఇది. ఈ చిత్రాన్ని శ్రీG ఫిలింస్ బేనర్‌పై అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో భారీ ఎత్తున నిర్మిస్తున్నాం. శ్రీధర్ సీపాన చాలా మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. నాగేశ్వరరెడ్డి ఈ సినిమాని సూపర్ డూపర్ హిట్ చెయ్యాలన్న పట్టుదలతో వర్క్ చేస్తున్నారు. మన్మథనామ సంవత్సర పర్వదినాన మన్మథుడు నాగార్జున చేతులమీదుగా ఈ సినిమా ప్రారంభం కావడం ఆనందంగా వుంది. ఈమధ్యకాలంలో అక్కినేని ఫ్యామిలీ హీరోల సినిమాలన్నీ సూపర్‌హిట్ చిత్రాలుగా నిలిచాయి. సుశాంత్‌తో చేస్తున్న ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం వుంది. సుశాంత్‌ని హీరోగా పెద్ద రేంజ్‌కి తీసుకెళ్ళే మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. ఏప్రిల్ 10 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం రోజునే నైజాం, సీడెడ్ ఏరియాలు ఫ్యాన్సీ ఆఫర్‌తో బిజినెస్ అవడం చాలా ఆనందంగా వుంది’’ అన్నారు.
సుశాంత్ కథానాయకుడుగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో నటించే హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. బ్రహ్మానందం, నాగినీడు, రఘుబాబు, తనికెళ్ళ భరణి, పృథ్వి, ప్రగతి, హేమ, సురేఖావాణి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీG ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీధర్ సీపాన, ఫైట్స్: కనల్ కణ్ణన్, ఎడిటింగ్: గౌతంరాజు, కళ: నారాయణరెడ్డి, ప్రొడక్షన్ కంట్రోలర్: ఎం.వి.ఎస్.వాసు, నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.