Advertisementt

మూడు సినిమాలతో నాని బిజీ..!!

Sat 21st Mar 2015 05:32 AM
hero nani,yevade subrahmanyam,jendapai kapiraju,bhale bhale magadivoy,naani,  మూడు సినిమాలతో నాని బిజీ..!!
మూడు సినిమాలతో నాని బిజీ..!!
Advertisement
Ads by CJ

ఎటువంటి సినిమా బాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో హీరోగా నిలదొక్కుకున్నాడు నాని. ఈగ తర్వాత తనకు సరైన హిట్ పడలేదు. బాలీవుడ్ లో బారీ సంస్థ యశ్ రాజ్ బ్యానర్లో ఆహ కళ్యాణం చేసాడు కాని హిట్ మాత్రం సొంతం చేస్కోలేకపోయాడు. ఏడాది క్రితం రిలీజ్ కావాల్సిన జెండాపై కపిరాజు సినిమా వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఉగాది కానుకగా ఈ 21న ప్రేక్షకుల ముందుకొస్తుంది. అదే రోజు తానూ నటించగా ప్రియాంక దత్ నిర్మించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా కూడా విడుదలవుతోంది. రెండు సినిమా ఒకదానికి ఒకటి పోటి పడ్తుంటే నాని మాత్రం రిజల్ట్ ఏమవుతుందో అని డైలమాలో ఉన్నాడు. అయితే జెండాపై కపిరాజు సినిమా తమిళ్ లో పరాజయాన్ని చూసిన  విషయం తెల్సిందే. అక్కడ జయం రవి యాక్ట్  చేసాడు. అయితే తెలుగులో నానికు మంచి మార్కెట్ ఉంది.  కాబట్టి తన సినిమాలు రెండు బాగానే ఆడతాయని ఫిలిం నగర్ టాక్. ఇదిలా ఉంటే మరో మూడు సినిమాలతో బిజీ కానున్నాడు నాని.

ఇటివల మారుతి దర్శకత్వం లో 'భలే భలే మగాడివో' సినిమా ప్రారంభమయింది. 14 రీల్స్ బ్యానర్ లో హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించాడు. చైతన్య దంతులూరితో మరో సినిమా చెయ్యబోతున్నాడు. ఐతే ఈ ఏడాది మూడు సినిమాలు ప్రేక్షకులకు అందించనున్నాడు నాని.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ