Advertisementt

త్రివిక్రమ్‌ అనుకున్నది సాధిస్తాడా..?

Fri 20th Mar 2015 02:38 PM
son of satyamurthey,trivikram,upendra,allu arjun  త్రివిక్రమ్‌ అనుకున్నది సాధిస్తాడా..?
త్రివిక్రమ్‌ అనుకున్నది సాధిస్తాడా..?
Advertisement
Ads by CJ

'అత్తారింటికి దారేది' వంటి బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ తర్వాత త్రివిక్రమ్‌ రూపొందిస్తున్న 'సన్నాఫ్‌  సత్యమూర్తి'పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక 'జులాయి' తర్వాత అల్లు  అర్జున్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మెగా అభిమానుల అంచనాల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. దీంతో ఈ సినిమాపై త్రివిక్రమ్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు సమాచారం. సినిమాలో సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్స్‌ అధికంగా ఉండేలా త్రివిక్రమ్‌ జాగ్రత్తపడుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ సినిమాలో నటిస్తున్న ఉపేంద్ర క్యారెక్టర్‌ గురించి ఏమాత్రం కూడా విషయం లీక్‌ కాకుండా దర్శకుడు చర్యలు తీసుకున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌లో ప్రతి క్యారెక్టర్‌ గురించి చూపించిన దర్శకుడు ఉపేంద్ర క్యారెక్టర్‌ బయటపడకుండా జాగ్రత్తవహించినట్లు చిత్ర యూనిట్‌ చెబుతోంది. మరి అభిమానుల అంచనాలను ఉపేంద్ర క్యారెక్టర్‌తో త్రివిక్రమ్‌ ఏమాత్రం అందుకుంటారో వేచిచూడాల్సిందే..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ