Advertisementt

వైజాగ్‌లో, వరంగల్‌లో ‘రుద్రమదేవి’ ఆడియో ఫంక్షన్స్‌

Thu 19th Mar 2015 01:56 PM
rudrama devi audio release,anushka,gunasekhar,rana,ilaiyaraja,  వైజాగ్‌లో, వరంగల్‌లో ‘రుద్రమదేవి’ ఆడియో ఫంక్షన్స్‌
వైజాగ్‌లో, వరంగల్‌లో ‘రుద్రమదేవి’ ఆడియో ఫంక్షన్స్‌
Advertisement
Ads by CJ

గ్లామర్‌స్టార్‌ అనుష్క టైటిల్‌ పాత్రలో, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ గోన గన్నారెడ్డిగా, రానా చాళుక్య వీరభద్రుడుగా గుణ టీమ్‌ వర్క్స్‌ పతాకంపై శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో అత్యంత భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో డైనమిక్‌ డైరెక్టర్‌ గుణశేఖర్‌ ప్రెస్టీజియస్‌గా స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న  ఇండియన్‌ ఫస్ట్‌ హిస్టారికల్‌ త్రీడీ ఫిలిం ‘రుద్రమదేవి’.

ఈ నెల 21వ తేదీ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం ఎంజిఎం పార్క్‌బీచ్‌లో సాయంత్రం 7 గంటలకు జరిగే ఉత్సవంలోను, ఆ మరుసటి రోజు ఆదివారం వరంగల్‌లోని ఫోర్ట్‌ వరంగల్‌ ప్రాంగణంలో సాయంత్రం 7 గంటలకు జరిగే వేడుకలోనూ చెరోచోట ‘రుద్రమదేవి’ చిత్రంలోని మూడు పాటలు చొప్పున మొత్తం ఆరుగా విడుదల కాబోతున్నాయి.

ఈ రెండు వేదికలపై రెండు వేడుకలుగా పబ్లిక్‌ ఫంక్షన్స్‌గా ఆయా ప్రాంతాల ప్రజల మధ్య జరుపుకోనున్నాయి. రెండుచోట్ల కూడా చిత్ర ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణులతోపాటు రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత గుణశేఖర్‌ విశాఖపట్నం, వరంగల్‌లోని ప్రజల్ని ఈ వేడుకకి సాదరంగా ఆహ్వానిస్తూ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో భారతదేశపు తొలి చారిత్రాత్మక స్టీరియోస్కోపిక్‌ త్రీడీ చిత్రం. ఈ వేసవిలో విడుదల కాబోతున్న ‘రుద్రమదేవి’ చిత్రంలో అనుష్క టైటిల్‌ రోల్‌ పోషించగా ఆమె సరసన రానా కథానాయకుడి పాత్ర పోషించారు. గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్‌ పాత్ర చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు లహరి ఆడియో ద్వారా విడుదల కాబోతున్నాయి.

 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ