Advertisementt

‘లయన్‌’ లోగో ఆవిష్కరణ

Thu 19th Mar 2015 10:48 AM
lion,telug movie lion,lion logo launch  ‘లయన్‌’ లోగో ఆవిష్కరణ
‘లయన్‌’ లోగో ఆవిష్కరణ
Advertisement
Ads by CJ

సాయిదీపు, రాజ్‌ధీర్‌, సితార, విశాలి ప్రధాన పాత్రల్లో ఎవ్రీ డే మూవీస్‌ పతాకంపై జె.డి. దర్శకత్వంలో జగదీష్‌, కడారి ప్రభాకర్‌ నిర్మిస్తున్న చిత్రం ‘లయన్‌’. ఈ చిత్రానికి సంబంధించిన లోగో ఆవిష్కరణ గురువారం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో జరిగింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ ‘లయన్‌’ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా..

ఘంటాడి కృష్ణ: జె.డి. మంచి టాలెంట్‌ వున్న డైరెక్టర్‌. ఇంతకుముందు ‘చిలిపిగా’ అనే పేరుతో ఒక సినిమా స్టార్ట్‌ చేశాం. అయితే అది మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు లేటెస్ట్‌గా జె.డి. చేస్తున్న ‘లయన్‌’ కాన్సెప్ట్‌ చాలా బాగుంటుంది. ఆ టైటిల్‌లోనే చాలా ఫోర్స్‌ వుంది. ఈ సినిమాలో మ్యూజిక్‌కి చాలా ఇంపార్టెన్స్‌ వుంది. మ్యూజిక్‌ చాలా బాగా వచ్చింది. సినిమా కూడా బాగుంటుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చే సినిమా అవుతుంది. 

జగదీష్‌: ఈ చిత్రానికి నిర్మాతగానే కాకుండా దర్శకుడుగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. నాకు సినిమా అంటే ప్రాణం. మా మిత్రులతో కలిసి ఈ సినిమా చేస్తున్నాను. ‘లయన్‌’ టైటిల్‌ని సంవత్సరం క్రితమే రిజిష్టర్‌ చేయించాను. ఈ టైటిల్‌ని బాలకృష్ణగారి సినిమా కోసం అడిగారు. కానీ, నేను ఇవ్వలేదు. ఎందుకంటే ‘లయన్‌’ అనే టైటిల్‌ మా సబ్జెక్ట్‌కి పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అవుతుంది. ఒక షెడ్యూల్‌ కంప్లీట్‌ చేశాం. ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ జరుగుతోంది. 

సాయిదీపు: ఈ సినిమాలోని క్యారెక్టర్‌కి నేను సూట్‌ అవుతానని నన్ను సెలెక్ట్‌ చేసుకున్నారు. నిజానికి నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేసేవాడిని. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు నా ధన్యవాదాలు. 

సితార: సినిమా చాలా బాగా వస్తోంది. అనుకున్న టైమ్‌లో సినిమాని పూర్తి చెయ్యడం కోసం మా పూర్తి సహకారాన్ని అందిస్తున్నాం.

సాయిదీపు, సితార, విశాలి, రాజ్‌ధీర్‌, రాజ్‌బాల, సోనాదత్‌, వైభవ్‌, సురేష్‌ పాణి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడి కృష్ణ, కెమెరా: చక్రి, ఎడిటర్‌: ఆనంద్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: రమణిరెడ్డి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: మహేష్‌ కృష్ణ, రచన, దర్శకత్వం: జె.డి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ