Advertisementt

శ్రీకాంత్‌ కొత్త చిత్రం పేరు ‘మెంటల్‌ పోలీస్‌’

Wed 18th Mar 2015 06:36 AM
telugu movie mental police,hero srikanth,aksha  శ్రీకాంత్‌ కొత్త చిత్రం పేరు ‘మెంటల్‌ పోలీస్‌’
శ్రీకాంత్‌ కొత్త చిత్రం పేరు ‘మెంటల్‌ పోలీస్‌’
Advertisement
Ads by CJ

శ్రీకాంత్‌ హీరోగా ఆండాళ్‌ మీడియా ప్రై. లిమిటెడ్‌ సమర్పణలో అనగాని ఫిలింస్‌, సుబ్రహ్మణ్యేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకాలపై కరణం పి.బాబ్జీ(శ్రీనివాస్‌) దర్శకత్వంలో ఎ.వి.వి.దుర్గాప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రానికి ‘మెంటల్‌ పోలీస్‌’ అనే టైటిల్‌ని కన్‌ఫర్మ్‌ చేశారు. ఈ చిత్ర విశేషాలను తెలిపేందుకు హీరో శ్రీకాంత్‌, దర్శకుడు కరణం పి.బాబ్జీ, ఎ.వి.వి.దుర్గాప్రసాద్‌, నటుడు నర్సింగ్‌ యాదవ్‌ మీడియాతో సమావేశమయ్యారు. 

శ్రీకాంత్‌: పోలీస్‌ క్యారెక్టర్స్‌ ఇంతకుముందు చాలా సినిమాలో చేశాను. ఆపరేషన్‌ దుర్యోధన చిత్రంలో పోలీస్‌గా, పొలిటికల్‌ లీడర్‌గా రెండు రకాల క్యారెక్టర్స్‌ చేశాను. ఈ చిత్రంలో నేను చేస్తున్న పోలీస్‌ క్యారెక్టర్‌ వాటన్నింటికీ డిఫరెంట్‌గా వుంటుంది. ఈ సినిమాలో నేను చేస్తున్న క్యారెక్టర్‌కి ‘మెంటల్‌ పోలీస్‌’ అనే టైటిల్‌ పూర్తి యాప్ట్‌ అవుతుంది. సమాజంలో అన్యాయాలు, అక్రమాలు చేసే వారికి మెంటల్‌ పోలీస్‌గా కనిపిస్తూ వారి ఆట ఎలా కట్టించాడన్నది కథాంశంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేస్తున్న శ్రీనివాస్‌ బేసిక్‌గా రైటర్‌. చాలా మంచి కథ చెప్పాడు. ఈ సినిమాకి ఆయన డైరెక్టర్‌ అయితేనే కథకు న్యాయం జరుగుతుందనిపించింది. ఈ సినిమా బాగా రావడంలో నిర్మాత సపోర్ట్‌ చాలా వుంది. ఈ సినిమాని విజయవాడలో స్టార్ట్‌ చేసి అక్కడే ఫస్ట్‌ షెడ్యూల్‌ కంప్లీట్‌ చేశాం. హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్‌ స్టార్ట్‌ చేశాం. ఇందులో సపోర్టింగ్‌ క్యారెక్టర్స్‌ కూడా చాలా బాగుంటాయి. ఆడియన్స్‌కి ఒక కొత్త ఫీల్‌ని కలిగించే సినిమా ఇది. 

కరణం పి.బాబ్జీ(శ్రీనివాస్‌): ఈ సబ్జెక్ట్‌కి తగ్గట్టుగా ‘మెంటల్‌ పోలీస్‌’ అనే టైటిల్‌ని పెట్టడం జరిగింది. శ్రీకాంత్‌గారు నటించిన ‘ఖడ్గం’ నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ మూవీ. ఆపరేషన్‌ దుర్యోధన ఎంత వెరైటీగా వుంటుందో అందరికీ తెలిసిందే. ఈ రెండు సినిమాలు కలిపితే ‘మెంటల్‌ పోలీస్‌’. జనంలోకి ఫాస్ట్‌గా దూసుకెళ్తుందన్న ఉద్దేశంతోనే ఈ టైటిల్‌ని పెట్టాం. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందని నమ్ముతున్నాను.

ఎ.వి.వి.దుర్గాప్రసాద్‌: ఈమధ్యకాలంలో ఆడియన్స్‌ థియేటర్స్‌కి ఎక్కువగా రావడం లేదన్న విషయం అందరికీ తెలిసిందే.ఒక అద్భుతమైన సబ్జెక్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఆడియన్స్‌ని థియేటర్‌కి రప్పిస్తుంది. శ్రీనివాస్‌ చాలా చక్కగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే శ్రీకాంత్‌గారు మాకు అన్నివిధాల తమ సహకారాన్ని అందిస్తున్నారు.

శ్రీకాంత్‌, అక్ష, కొండవలస, జీవా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: బుజ్జి కె., ఆర్ట్‌: సతీష్‌వర్మ, అసోసియేట్‌ డైరెక్టర్‌: దుర్గ డి.ఆర్‌., కో`డైరెక్టర్‌: మల్లిఖార్జున్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: పి.సత్యనారాయణ, నిర్మాత: ఎ.వి.వి.దుర్గాప్రసాద్‌, దర్శకత్వం: కరణం పి.బాబ్జీ(శ్రీనివాస్‌).

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ