Advertisementt

‘రేయ్‌’ కోసం ‘పవనిజం’ సాంగ్‌ రిలీజ్‌

Wed 18th Mar 2015 06:26 AM
telugu movie rey,saidharam tej,sayami kher,r.narayana murthy,v.v.vinayak,chakri,pavanism song  ‘రేయ్‌’ కోసం ‘పవనిజం’ సాంగ్‌ రిలీజ్‌
‘రేయ్‌’ కోసం ‘పవనిజం’ సాంగ్‌ రిలీజ్‌
Advertisement
Ads by CJ

సాయిధరమ్‌తేజ్‌, సయామి ఖేర్‌ జంటగా బొమ్మరిల్లు పతాకంపై వై.వి.ఎస్‌.చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘రేయ్‌’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఈ చిత్రం కోసం పవన్‌కళ్యాణ్‌కి ట్రిబ్యూట్‌ ఇస్తూ ‘పవనిజం’ పేరుతో ఓ పాటను రూపొందించారు. చంద్రబోస్‌ రచించిన ఈ పాటను చక్రి స్వరపరిచారు. ఈ పాట ఆవిష్కరణ మంగళవారం ప్రసాద్‌ ల్యాబ్‌లో విడుదల చేశారు. ఆర్‌.నారాయణమూర్తి ఈ పాటను విడుదల చేసి తొలి ప్రతిని వి.వి.వినాయక్‌కి అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో సాయిధరమ్‌తేజ్‌, హీరోయిన్‌ సయామి ఖేర్‌, సంగీత దర్శకుడు చక్రి సతీమణి శ్రావణి, చంద్రబోస్‌, ఎడిటర్‌ గౌతంరాజు, కెమెరామెన్‌ భరణి కె.ధరన్‌, నటి హేమ, ‘పవనిజం’ పాటను పాడిన నరేంద్ర, ఈ పాటలో ర్యాప్‌ని రచించి గానం చేసిన నోయల్‌, చిత్రంలో హీరోకి ఫ్రెండ్స్‌గా నటించిన సుభాష్‌, మధు, మధుకిరణ్‌, కో ప్రొడ్యూసర్‌ యుక్త తదితరులు పాల్గొన్నారు. 

సయామి ఖేర్‌: మెగా ఫాన్స్‌కి స్పెషల్‌ డే ఇది. ఈ సినిమాలో ‘పవనిజం’ సాంగ్‌ ఒన్‌ ఆఫ్‌ ది హైలైట్‌ అవుతుంది. కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమా కోసం సాయిధరమ్‌ చాలా హార్డ్‌ వర్క్‌ చేశారు. వై.వి.యస్‌. చౌదరిగారు లేకపోతే నేను ఇక్కడ వుండేదాన్ని కాదు. నాకు గురువులా ఎన్నో విషయాలు నేర్పించారు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్‌ అయి అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను.

సాయిధరమ్‌తేజ్‌: పెద్ద మావయ్యది ఓ పెద్ద సామ్రాజ్యం. అలాగే చిన్న మావయ్య తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు. ఆయనకు ట్రిబ్యూట్‌ ఇవ్వడం కోసం ఎంతో ఇన్నోవేటివ్‌గా ఆలోచించి ఈ పాట చేశారు. నా గురువులాంటి కళ్యాణ్‌ మావయ్య కోసం చేసిన పాటలో నేను నటించడం చాలా ఎక్సైట్‌ ఫీల్‌ అవుతున్నాను. 

శ్రావణి: పవన్‌కళ్యాణ్‌గారి సినిమా చెయ్యాలన్నది చక్రిగారి కోరిక. పవన్‌ కళ్యాణ్‌గారి కోసం చేసిన ఈ పాటే ఆయన చివరి పాట అవుతుందని అనుకోలేదు. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. మ్యూజిక్‌ వున్నంత కాలం చక్రిగారు బ్రతికే వుంటారు.

వి.వి.వినాయక్‌: చౌదరి ఒక యోధుడు. లాహిరి లాహిరి సినిమా కోసం ఇంత కంటే ఎక్కువ కష్టపడ్డాడు. ఎన్ని కష్టాలు ఫేస్‌ చేసినా తను అనుకున్న సినిమా తీస్తాడు, సక్సెస్‌ అవుతాడు. ఎప్పుడు యుద్ధం చేసినా గెలిచాడు. ఇప్పుడు కూడా తప్పకుండా గెలుస్తాడు. ఈ సినిమా మీద అందరికీ చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. పాట విన్నాను. చాలా బాగుంది. రజనీకాంత్‌ మీద పాట ఎలా చేశారో అలాగే పవన్‌కళ్యాణ్‌పై ఈ పాట చేశారు. ఈ పాట ఫ్యాన్స్‌కే కాదు అందరికీ నచ్చుతుంది. 

ఆర్‌.నారాయణమూర్తి: చిరంజీవిగారి మొదటి సినిమా రిలీజ్‌ కాకముందే రెండో సినిమా రిలీజ్‌ అయింది. అలాగే సాయిధరమ్‌ మొదటి సినిమా ‘రేయ్‌’ రిలీజ్‌ అవకముందే ‘పిల్లా నువ్వులేని జీవితం’ రిలీజ్‌ అయి పెద్ద హిట్‌ అయింది. చిరంజీవిగారి పోలికలే కాదు, ఆయన సెంటిమెంట్‌ కూడా సాయిధరమ్‌కి వర్కవుట్‌ అవుతుంది. పవన్‌కళ్యాణ్‌ పేరు మీద ఈ పాట చేయడం చాలా గొప్ప విషయం. పాట విన్నాను. చంద్రబోస్‌ చాలా చక్కగా రాశారు. ఈరోజు ఫంక్షన్‌ చక్రిది. గొప్ప మానవతావాది. ఆయన ఆశీస్సులు ఈ సినిమాకి తప్పకుండా వుంటాయి. చౌదరి గురించి చెప్పాలంటే మడమ తిప్పని ధైర్యం వున్న ఎన్‌.టి.రామరావుగారి అభిమానిగా అవే లక్షణాలను పుణికి పుచ్చుకున్నాడు చౌదరి. ఈ సినిమాతో మళ్ళీ ఓ పెద్ద హిట్‌ కొడతాడు. 

వై.వి.యస్‌.చౌదరి: ఈ సినిమా కాన్సెప్ట్‌ అనుకున్నప్పుడే చాలా బడ్జెట్‌తో కూడుకున్న సినిమా, దీని కోసం ఎంతో కష్టపడాల్సి వుంటుందని తెలుసు. అందుకే ఈ సినిమా కోసం ఎక్కువ టైమ్‌ తీసుకోవడం జరిగింది. ఎక్కువ శాతం విదేశాల్లోనే షూటింగ్‌ జరుపుకున్న ఈ చిత్రం ఆడియన్స్‌ని హండ్రెడ్‌ పర్సెంట్‌ శాటిస్‌ఫై చేస్తుంది. ‘పవనిజం’ పాట గురించి చెప్పాలంటే రోహిత్‌ శెట్టి డైరెక్ట్‌ చేసిన ‘చెన్నయ్‌ ఎక్స్‌ప్రెస్‌’లో రజనీకాంత్‌పై చేసిన సాంగ్‌ చూసి మనం పవన్‌కళ్యాణ్‌గారిపై ఒక సాంగ్‌ చేస్తే బాగుంటుందని అనుకున్నాం. ఈ పాట ఇప్పుడు చేసింది కాదు. దాదాపు సంవత్సరంన్నర క్రితమే ఈ పాట పెట్టాలన్న ఆలోచనతో రికార్డ్‌ చేయించడం జరిగింది. ఈ పాట షూటింగ్‌ 19 నుంచి మూడు రోజులపాటు జరుగుతుంది. సినిమా రిలీజ్‌ టైమ్‌కి పాట రెడీ అయితే పాటతోనే సినిమా రిలీజ్‌ అవుతుంది. లేదా రెండు మూడు రోజుల తర్వాత యాడ్‌ చేస్తాం. ఈ పాట వుండడం వల్ల సినిమాకి ఒక ఎనర్జీ వస్తుందన్న ఉద్దేశంతో చేశాం. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ