Advertisementt

‘సూర్య వర్సెస్‌ సూర్య’ ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌

Tue 17th Mar 2015 07:50 AM
surya vs surya review,hero nikhil,karthik ghattamaneni,malkapuram siva kumar  ‘సూర్య వర్సెస్‌ సూర్య’ ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌
‘సూర్య వర్సెస్‌ సూర్య’ ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌
Advertisement
Ads by CJ

నిఖిల్‌, త్రిధా చౌదరి జంటగా బేబి త్రిష సమర్పణలో సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండియా ప్రై. లిమిటెడ్‌ పతాకంపై కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్‌ నిర్మించిన వెరైటీ చిత్రం ‘సూర్య వర్సెస్‌ సూర్య’. ఈ చిత్రం మార్చి 5న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అయి మంచి ఓపెనింగ్స్‌తో 11 రోజుల్లోనే 11 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసింది. ఈ చిత్రానికి సత్య మహావీర్‌ అందించిన సంగీతం చాలా పెద్ద సక్సెస్‌ అయింది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ను నిర్వహించింది చిత్ర యూనిట్‌. ఈ ఫంక్షన్‌లో హీరో నిఖిల్‌, తనికెళ్ళ భరణి, దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని, నిర్మాత మల్కాపురం శివకుమార్‌, సంగీత దర్శకుడు సత్య మహావీర్‌, రచయిత చందు మొండేటి, తాగుబోతు రమేష్‌, టి.ఎన్‌.ప్రసాద్‌, సంధ్య డిజిటల్స్‌ రవి, డిస్ట్రిబ్యూటర్లు వాసు, జనార్థన్‌, ఆదిత్య మ్యూజిక్‌ సత్యదేవ్‌ తదితరులు పాల్గొన్నారు. తనికెళ్ళ భరణి చేతుల మీదుగా యూనిట్‌ సభ్యులకు ప్లాటినం డిస్క్‌లు ప్రదానం చేశారు. 

నిఖిల్‌: సినిమా స్టార్ట్‌ చేసినపుడు ఈ కాన్సెప్ట్‌ ఆడియన్స్‌కి నచ్చుతుందా, సినిమా బాగా వస్తుందా అని చాలా డౌట్స్‌ వుంటాయి. అయితే సినిమా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా రావడమే కాకుండా ఆడియన్స్‌ బాగా రిసీవ్‌ చేసుకున్నారు. రెవిన్యూ పరంగా మేమంతా చాలా హ్యాపీగా వున్నాం. డిఫరెంట్‌ పాయింట్‌ని ఆడియన్స్‌ యాక్సెప్ట్‌ చేశారు. అలాగే పాటలు చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. సత్య మహావీర్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ అందించాడు. ఈ సినిమా రిలీజ్‌ అయి రెండో వారంలోకి ఎంటర్‌ అయినప్పటికీ స్టిల్‌ హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో రన్‌ అవడం చాలా హ్యాపీగా వుంది. కార్తీక్‌ చాలా అద్భుతంగా తీశాడు. అతనితో వర్క్‌ చేయడం చాలా సంతోషం కలిగించింది. త్వరలోనే మా కాంబినేషన్‌లో మరో సినిమా చేయబోతున్నాం. ఇలాంటి డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీని ప్రొడ్యూస్‌ చెయ్యాలంటే నిర్మాతకి చాలా ధైర్యం కావాలి. మా నిర్మాత శివకుమార్‌గారు ఎంతో డేర్‌తో చేసిన ఈ సినిమా పెద్ద హిట్‌ కావడంతో యూనిట్‌లోని అందరం చాలా ఆనందంగా వున్నాం. 

తనికెళ్ళ భరణి: ఎండాకాలంలో చల్లని సినిమా ‘సూర్య వర్సెస్‌ సూర్య’. ఒకప్పుడు సినిమాలు హిట్‌ అయితే 100 రోజుల ఫంక్షన్స్‌కి షీల్డ్‌ తీసుకోవడానికి వచ్చేవారు అప్పటి హీరోలు. కానీ, ఇప్పుడున్న యూత్‌ హీరోలను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. సినిమా స్టార్ట్‌ అయిన రోజు నుంచి సినిమాని ప్రమోట్‌ చెయ్యడంలో ముందుంటున్నారు. నేను కెరీర్‌ స్టార్ట్‌ చేసిన తర్వాత నా నాలుగో సినిమా లేడీస్‌ టైలర్‌. ఆ సినిమా చాలా పెద్ద హిట్‌ అయింది. ఆ తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ సినిమా అంత పెద్ద హిట్‌ కావడానికి ముఖ్యమైన కారణం టీమ్‌ వర్క్‌. తమ పని తాము చేసుకొని వెళ్ళిపోవడం కాకుండా అన్ని పనులూ తమవే అన్నట్టుగా వర్క్‌ చేశాం కాబట్టే ఆ సినిమా అంత పెద్ద హిట్‌ అయింది. మళ్లీ ఇప్పుడు ఈ సినిమాకి అలాంటి టీమ్‌ని చూశాను. అందరి సమిష్టి కృషితో ఈ సినిమా సూపర్‌హిట్‌ అయి, ప్లాటినం డిస్క్‌ దశకు వచ్చింది.

సత్య మహావీర్‌: నిఖిల్‌తో మనం సినిమా చేస్తున్నాం అని కార్తీక్‌ చెప్పగానే నేను చాలా హ్యాపీ ఫీల్‌ అయ్యాను. ఇలాంటి డిఫరెంట్‌ సబ్జెక్ట్‌కి పాటలు ఎలా వుండాలి, రీరికార్డింగ్‌ ఎలా వుండాలి అనేది ఆలోచించుకొని మంచి మ్యూజిక్‌ చెయ్యడానికి కృషి చేశాను. పాటలు ఇంత పెద్ద హిట్‌ అయి ఈరోజు ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ చేసుకోవడం ఆనందంగా వుంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు, నిఖిల్‌గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

కార్తీక్‌ ఘట్టమనేని: కార్తికేయ సినిమాకి నేను కెమెరా వర్క్‌ చేశాను. ఆ టైమ్‌లోనే నిఖిల్‌కి ఈ కథ చెప్పాను. కార్తికేయ లేకపోతే నాకు ఈ సినిమా లేదు. ఆ సినిమాని డైరెక్ట్‌ చేసిన చందు ఈ సినిమాకి డైలాగ్స్‌ రాసి నాకు ఎంతో హెల్ప్‌ చేశారు. ఈ సినిమాలో తనికెళ్ళ భరణిగారు, రావు రమేష్‌గారు, షాయాజీ షిండేగారు, మధుబాలగారు వంటి సీనియర్‌ ఆర్టిస్టులతో వర్క్‌ చేసే అవకాశం నాకు కలిగింది. మా సినిమాకి ఇంత పెద్ద హిట్‌ ఇచ్చి, ఆడియోను కూడా పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు థాంక్స్‌.

మల్కాపురం శివకుమార్‌: ఒక కొత్త కాన్సెప్ట్‌తో చేసిన మా ‘సూర్య వర్సెస్‌ సూర్య’ 11 రోజుల్లోనే 11 కోట్లు గ్రాస్‌ కలెక్ట్‌ చేసింది. ఈ కలెక్షన్‌ ఆదివారం వరకు వచ్చినవి. సోమవారం నుంచి కూడా అన్ని చోట్లా మంచి కలెక్షన్స్‌ వస్తున్నాయి. నిఖిల్‌గారి కెరీర్‌లోనే హయ్యస్ట్‌ 628 థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేశాం. ఈ సినిమాని రిలీజ్‌ చెయ్యడంలో డిస్ట్రిబ్యూటర్స్‌ ఎంతో సహకరించారు. అలాగే ఓవర్సీస్‌లో 168 సెంటర్స్‌లో రిలీజ్‌ అయిన ఫస్ట్‌ మూవీగా ‘సూర్య వర్సెస్‌ సూర్య’ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ప్రజెంట్‌గా అక్కడ 75 సెంటర్స్‌లో ఈ సినిమా రన్‌ అవుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 200 థియేటర్స్‌లో దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సినిమా ఇంత పెద్ద హిట్‌ కావడంలో యూనిట్‌ కోఆపరేషన్‌ ఎంతో వుంది. కార్తీక్‌ తను చెప్పిన కథ కంటే 100 రెట్లు బాగా తీశాడు. సత్య మహావీర్‌కి ఇది మొదటి సినిమా అయినప్పటికీ చాలా అద్భుతమైన మ్యూజిక్‌ చేశాడు. నిఖిల్‌ మొదటి నుంచి డెఫినెట్‌గా పెద్ద హిట్‌ కొడతామన్న కాన్ఫిడెన్స్‌తో పనిచేశారు. ఇంత మంచి సినిమాని ప్రేక్షకులకు అందించడంలో సహకరించిన యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ