11 రోజులకు 11 కోట్లతో దూసుకుపోతున్న ‘సూర్య వర్సెస్ సూర్య’
నిఖిల్, త్రిదా చౌదరి హీరోహీరోయిన్‌లుగా సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రై. లిమిటెడ్ బ్యానర్‌లో, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన ‘సూర్య వర్సెస్ సూర్య’ చిత్రం 11 రోజులకు 11 కోట్ల గ్రాస్‌ని సాధించి సెన్సేషనల్ విజయానికి చేరువైంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ..‘‘మా చిత్రం 11 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణ, ఓవర్సీస్‌లో కలిసి 11 కోట్ల గ్రాస్‌ని సాధించింది. ముందుగా మా చిత్రానికి ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ చిత్రంలో నటించిన నటీనటులందరూ ఈ చిత్రం కోసం ఎంతగానో కష్టపడ్డారు. ఈ రోజు ప్రేక్షకులు అందించిన ఇంతటి ఘన విజయం మా కష్టాన్ని కూడా మరిచిపోయేలా చేసింది. మా చిత్రం తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. మా సంస్థ నుండి ఇలాంటి మరిన్ని మంచి చిత్రాలు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను..’ అన్నారు.
నిఖిల్, త్రిదాచౌదరి, తనికెళ్ళ భరణి, మధుబాల, రావురమేష్, షాయాజీ షిండే, సత్య, తాగుబోతు రమేష్, రాజారవీంద్ర, ప్రవీణ్, అల్లరి సుభాషిణి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేనిÑ మాటలు: చందు మొండేటి, ఎడిటింగ్ : గౌతమ్ నెరసు, ఆర్ట్: టి. ఎన్. ప్రసాద్, కొరియోగ్రఫీ: విజయ్, ఫైట్స్: వెంకట్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, కృష్ణచిన్ని, సంగీతం: సత్య మహవీర్,
నిర్మాత: మల్కాపురం శివకుమార్
రచన, దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని