కన్నడ ప్రముఖ నిర్మాతలు శైలేంద్ర బాబు, శ్రీధర్ రెడ్డి, హరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో “ఉయ్యాలా జంపాల “ ఫేం రాజ్ తరుణ్ హీరో గా కొత్త చిత్రం ప్రారంభం అయ్యింది . విలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రుపొందునుంది. ఈ చిత్రం లో ప్రముఖ తారాగణం నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కధా రచయిత శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకుడిగా పరిచయము అవుతున్నారు. ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. “ఉయ్యాలా జంపాల “ ఫేం విశ్వా ఈ చిత్రానికి కెమరామెన్ గా చేస్తున్నారు.
ముఖ్య అతిధులు గా విచ్చేసిన శ్రీ రావులపాటి సీతారామారావు IPS గారు క్లాప్ ని ఇవ్వగా, బేబీ గౌతమి కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా , ఉయ్యాలా జంపాల దర్శకులు విరించి వర్మ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత తల్లిదండ్రులు స్క్రిప్ట్ ని అందచేసారు.
హీరో ఆది, దర్శకులు N.శంకర్, మారుతి, మదన్ అతిధులు గా విచ్చేసి యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.