Advertisementt

అంకయ్య ఆర్ట్‌ క్రియేషన్స్‌ చిత్రం ప్రారంభం

Sun 15th Mar 2015 04:04 PM
ankayya art creations,krishna,santhoshini,jagan yadav,naga sai aakula  అంకయ్య ఆర్ట్‌ క్రియేషన్స్‌ చిత్రం ప్రారంభం
అంకయ్య ఆర్ట్‌ క్రియేషన్స్‌ చిత్రం ప్రారంభం
Advertisement
Ads by CJ
న్యూ హీరో హీరోయిన్లు కృష్ణ, సంతోషిని జంటగా అంకయ్య ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై నాగసాయి ఆకుల దర్శకత్వంలో జగన్‌ యాదవ్‌ ప్రొడక్షన్‌ నెం.2గా నిర్మిస్తున్న ప్రేమకథా చిత్రం ఆదివారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ఈ చిత్రానికి సంబంధించి ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్‌నివ్వగా, హీరో మనోజ్‌ నందం కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఫస్ట్‌ షాట్‌ను ప్రముఖ నిర్మాత రాజ్‌ కందుకూరి డైరెక్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో కృష్ణ, హీరోయిన్‌ సంతోషిని, దర్శకుడు నాగసాయి ఆకుల, నిర్మాత జగన్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.
జగన్‌ యాదవ్‌: మా అంకయ్య ఆర్ట్‌ క్రియేషన్స్‌ బేనర్‌లో ప్రొడక్షన్‌ నెం.2గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. డైరెక్టర్‌ నాగసాయి చెప్పిన కథ చాలా బాగుంది. పూర్తి ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకునే ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ను అనంతపురంలో, రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో చేస్తాం. ఈ సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చే విధంగా మా దర్శకుడు రూపొందిస్తాడన్న నమ్మకం నాకు వుంది.
నాగసాయి ఆకుల: ఒక కొత్త కాన్సెప్ట్‌తో రూపొందుతున్న లవ్‌స్టోరీ ఇది. యూత్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని చేస్తున్నాం. మా యూనిట్‌లోని అందరి సహకారంతో చిత్రాన్ని అనుకున్న టైమ్‌లో పూర్తి చేయడానికి పక్కాగా ప్లాన్‌ చేశాం.
కృష్ణ: యూత్‌కి హండ్రెడ్‌ పర్సెంట్‌ నచ్చే కంప్లీట్‌ లవ్‌స్టోరీ ఇది. చక్కని ప్రొడక్షన్‌ వేల్యూస్‌తో మా నిర్మాత జగన్‌ యాదవ్‌గారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది.
సంతోషిని: ఈ సినిమాలో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్‌ చెప్తున్నాను. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
కృష్ణ, సంతోషిని, బాంబే పద్మ, కుమార్‌రెడ్డి, రాజు, మహేందర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రదీప్‌ చంద్ర, సినిమాటోగ్రఫీ: రవికుమార్‌, పాటలు: నిఖిల్‌, ఫైట్స్‌: కుమార్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌: డిజిక్వెస్ట్‌, నిర్మాత జగన్‌ యాదవ్‌, దర్శకత్వం: నాగసాయి ఆకుల. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ