Advertisementt

'మార్గం' సినిమా ట్రైలర్ లాంచ్..!

Fri 13th Mar 2015 07:05 AM
margam movie,trailer launch,r.sathyanarayana  'మార్గం' సినిమా ట్రైలర్ లాంచ్..!
'మార్గం' సినిమా ట్రైలర్ లాంచ్..!
Advertisement
Ads by CJ

తమిళంలో ఘన విజయం సాధించిన 'జయన్ కొండాన్' అనే సినిమాను తెలుగులో సత్యదేవా పిక్చర్స్ బ్యానర్ పై ఆర్.సత్యనారాయణ 'మార్గం' అనే టైటిల్ తో మార్చి చివరి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ శుక్రవారం(మార్చి13) న హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ సత్యనారాయణ మాట్లాడుతూ "లండన్ లో ఉన్న ఓ కుర్రాడు ఉద్యోగం వదిలేసి ఇండియాకి వచ్చిన తరువాత అనుకోని ఓ సంఘటనలో ఇరుక్కుంటాడు. ఆ పరిస్థితుల నుంచి హీరో తనను, తన ఫ్యామిలీ ను ఎలా రక్షించుకోగలిగాడనేదే కథ. ఈ సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ ను డైరెక్టర్ బాగా ప్రెజెంట్ చేసారు. మార్చి రెండవ వారంలో ఆడియోను, మార్చి చివరి వారంలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. తమిళంలో 100 రోజులు ఆడిన ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నాను" అని అన్నారు

ప్రముఖ నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ "తమిళంలో విజయం సాధించిన ఈ సినిమాను మంచి అభిరుచితో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు సత్యనారాయణ. మంచి కాస్టింగ్ తో రూపొందిన ఈ మార్గం ఆయన విజయానికి మార్గం అవ్వాలని కోరుకుంటున్నా" అని అన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ రామారావు మాట్లాడుతూ "అన్ని రకములైన విలువలు కలిగిన కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ సినిమా ఇది. ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది" అని అన్నారు.

వినాయకరావు మాట్లాడుతూ "దర్శకత్వంలో మంచి అనుభవం ఉన్న సత్యనారాయణ నిర్మించిన మూడో సినిమా ఇది. మణిరత్నం గారి దగ్గర శిష్యుడు కన్నన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్ని వర్గాల వారికి ఈ సినిమా నచ్చుతుంది" అని అన్నారు.

నటీనటులు: వినయ్, భావన, లేఖా వాషింగ్ టౌన్, కిషోర్, సంతానం, వివేక్, శరణ్య మోహన్ 

సాంకేతిక వర్గం: మాటలు: వెంకట్ మల్లూరి, ఫోటోగ్రఫీ: బాల సుబ్రహ్మణ్యం, సంగీతం: విద్యాసాగర్, కథ-దర్శకత్వం: ఆర్.కన్నన్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ