Advertisementt

డాక్ట‌ర్ల‌కు 'డా. సలీమ్` స్పెష‌ల్ షో

Thu 12th Mar 2015 03:39 AM
dr.saleem,dr.saleem on 13th march,suresh kondeti,vijay antony  డాక్ట‌ర్ల‌కు 'డా. సలీమ్` స్పెష‌ల్ షో
డాక్ట‌ర్ల‌కు 'డా. సలీమ్` స్పెష‌ల్ షో
Advertisement
Ads by CJ

విజయ్ ఆంటోని, అక్ష జంటగా తమిళంలో రూపొందిన 'సలీమ్' చిత్రం తెలుగులో 'డా. సలీమ్' గా వస్తోన్న విషయం తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని నాగప్రసాద్ సన్నిధీ సమర్పణలో ఎస్.కె. పిక్చర్స్ మరియు ఓబులేశ్వర ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 13న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని బుధవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో డాక్టర్ల కోసం ప్రదర్శించారు.

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో రాగ‌స‌ప్త‌స్వ‌రి ప్ర‌తినిధి రాజ్య‌ల‌క్ష్మి డాక్ట‌ర్లు రాజ‌గోపాల్‌, జ్యోత్స్న‌, కుసుమ‌, సీతారామ్‌, అభిన‌వ్‌తో పాటు స‌ర్వ‌మంగ‌ళ‌గౌరి, బాల‌, అభినంద‌న భ‌వానీ, విజ‌య‌దుర్గ‌, జ‌య‌ప్ర‌భ‌ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..

సురేష్ కొండేటి: ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు చాలా మంచి స్పందన లభిస్తోంది. విజయ్ ఆంటోని గారు అన్ని పాటలు చాలా అద్భుతంగా చేసారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 13న విడుదల చేస్తున్నాము. తమిళంలో 'సలీమ్' పేరుతో వచ్చిన ఈ చిత్రానికి తెలుగులో 'డా. సలీమ్' పేరు పెట్టాం. మా బేనర్ లో గతం లో వచ్చిన జర్నీ, ప్రేమిస్తే, పిజ్జా చిత్రాల్లాగే ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. నాకూ, త‌మ‌టం కుమార్ రెడ్డికి, మా సంస్థ‌కు మంచి పేరు తెచ్చే యూత్‌ఫుల్ మూవీ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే విధంగా ఈ చిత్రం వుంటుంది. 

తమటం కుమార్ రెడ్డి: మంచి మెసేజ్ వున్న సినిమా ఇది. ముఖ్యంగా ఈ సినిమాని యూత్ చూడాల్సిన అవసరం వుంది. ఈ నెల 13న విడుదలవుతున్న ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది.  

ఈ చిత్రానికి సహనిర్మాత: ఎం. అర్జున్ గౌడ్. దర్శకత్వం: ఎన్.వి. నిర్మల్ కుమార్. సంగీతం: విజయ్ ఆంటోని.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ