బొమ్మరిల్లు వారి పతాకం పై వై వి యస్ చౌదరి స్వీయ దర్శకత్వం లో సాయి ధరం తేజ్ హీరో గా నిర్మించిన 'రేయ్' చిత్రం మార్చి 27న విడుదల చేస్తున్నా విషయం తెలిసిందే. విడుదలకు ముందు మార్చి 14న ప్రత్యేకంగా ఒక పవర్ ఫుల్ ప్రోగ్రాం నిర్వహించనున్నారు వై వి యస్ చౌదరి, ఆ కార్యక్రమం ఏమిటంటే, రేయ్ చిత్రం ఆడియో లో పవన్ కళ్యాణ్ పై వచ్చే 'పవన్ నిజం ' అనే ఒక స్పెషల్ సాంగ్ ను జత చేయనున్నారు. ఈ పాట ఒక హై వోల్టేజ్ తో, ఎనర్జీ టిక్ గా, ప్లే ఫుల్ గా నిలబడుతుంది అనడంలో సందేహం లేదు.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత వై వి ఎస్ చౌదరి మాట్లాడుతూ " బొమ్మరిల్లు వారి పతాకం పై నా స్వీయ దర్శకత్వం లో నిర్మించిన 'రేయ్' చిత్రం మార్చి 27న విడుదల చేస్తున్నాం. సాయి ధరం తేజ్ ఎవరో ఏంటో తెలియకుండానే అతని రూపం చూసి ఇన్ స్పైర్ అయ్యి రేయ్ సినిమా చేద్దామని అనుకున్నాను. కాని అతని వెనుక ముగ్గురు మెగా బ్రదర్స్ వున్నారని తెలుసుకున్నాను .నా ఆలోచన తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . చిరంజీవి, నాగబాబు గార్ల ద్వార ప్రోసిడిన్గ్స్ జరిగాయి పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ కి మెగా స్టార్ చిరంజీవి గారి తమ్ముడి గా, పరిచయం అయిన కూడా, తన ఇండువిజ్వలాటి తో మేనరిజమ్స్, సబ్జక్ట్స్ సెలెక్షన్స్ తో , ఒక సపరేట్ స్టైల్ ఆఫ్ సాంగ్స్ డిజైన్ఇంగ్ తో , తనదైన ఒక బ్రాండ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. కామన్ మెన్ నుండి ఆమెరికా లో వున్నా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వరకు వయోభేదం లేకుండా అన్ని వర్గాల సిని ప్రేక్షకుల మనసులలో' పవన్ కళ్యాణ్ సినిమా ఇది' అని ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తో ఒక అత్య అద్భుత మైన స్టార్ డం తెచ్చుకోవడమే కాక పవర్ స్టార్ గా ఎదిగారు. నటుడి గానే కాకుండా సామాజిక సృహ తో ప్రజా సమస్యలకు స్పందిస్తూ తెలుగు రాష్ట్ర ల స్తాయి నుండి జాతీయ స్తాయి వరకు ఎదిగారు . 'చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్రం లో బాలివుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మన సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజిని కాంత్ అభిమానులని ఉత్తెజపరచడానికి చిత్రం లో ఆయన కి ట్రిబ్యూట్ లాగ 'లుంగీ డాన్స్' అనే పాట ను ఎలా పెట్టారో అదే స్పూర్తి తో , పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఒక ఎనర్జీటిక్ టానిక్ లాగ మేము కూడా ప్రత్యేకంగా 'పవనిజం' సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నాం . ఈ పాటను స్వర్గీయ చక్రి కంపోస్ చేసారు. చంద్ర బోస్ రచించిన ఈ పాటను నోయల్ షాన్ అనే అతను రాప్ రాసుకోవడమే కాకుండా ఆ రాప్ ని అతేనే పాడాడు, మెయిన్ సింగర్ 'కిరాక్' సాంగ్ ఫేం నరేంద్ర పాడారు. ఈ 'పవనిజం' ఆడియో సాంగ్ ని మార్చి 14 న అభిమానుల కోలాహలం మధ్య రిలీజ్ చేయబోతున్నందుకు సంతోషిస్తున్నాను" అన్నారు