Advertisementt

‘సూర్య వర్సెస్‌ సూర్య’ సక్సెస్‌మీట్‌

Mon 09th Mar 2015 07:02 AM
surya vs surya,nikhil,trida chowdary,karthik ghattamaneni,malkapuram siva kumar  ‘సూర్య వర్సెస్‌ సూర్య’ సక్సెస్‌మీట్‌
‘సూర్య వర్సెస్‌ సూర్య’ సక్సెస్‌మీట్‌
Advertisement
Ads by CJ

నిఖిల్‌, త్రిధా చౌదరి జంటగా బేబి త్రిష సమర్పణలో సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండియా ప్రై. లిమిటెడ్‌ పతాకంపై కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్‌ నిర్మించిన చిత్రం ‘సూర్య వర్సెస్‌ సూర్య’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్‌ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతున్న నేపథ్యంలో సోమవారం చిత్ర యూనిట్‌ సక్సెస్‌మీట్‌ని ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్‌మీట్‌లో హీరో నిఖిల్‌, హీరోయిన్‌ త్రిధా చౌదరి, తనికెళ్ళ భరణి, ప్రవీణ్‌, వైవా హర్ష, దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని, నిర్మాత మల్కాపురం శివకుమార్‌ పాల్గొన్నారు. 

తనికెళ్ళ భరణి: ఈమధ్య నేను ఈస్ట్‌ గోదావరి, వెస్ట్‌ గోదావరి వెళ్ళి వచ్చాను. అక్కడ స్టూడెంట్స్‌ నుంచి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. కొత్త కథాంశంతో రూపొందిన ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటోంది. అధైర్యంతో వున్న ఓ కుర్రాడ్ని అతని ప్రేమ ధైర్యంగా ఎలా మార్చిందన్న పాయంట్‌ అందరికీ నచ్చింది. ఈ సినిమా ఇంత బాగా రావడానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి నిర్మాత వరకు ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పనిచేశారు. ఇంత సక్సెస్‌ఫుల్‌ మూవీలో నేను కూడా ఒక మంచి పాత్ర చేయడం ఆనందంగా వుంది.

కార్తీక్‌ ఘట్టమనేని: ఈ సినిమాని ఇంత పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమాని క్వాలిటీగా తియ్యమని, బడ్జెట్‌ గురించి ఆలోచించ వద్దని నిర్మాత శివకుమార్‌గారు ఎంతో సపోర్ట్‌ చేశారు. తనికెళ్ళ భరణిగారు నటుడుగానే కాకుండా డైలాగ్స్‌ పరంగా నాకెంతో హెల్ప్‌ చేశారు. ఈ సినిమా ఇంకా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను.

త్రిధా చౌదరి: ఈ సూపర్‌హిట్‌ సినిమాలో నేను కూడా ఒక పార్ట్‌ అయినందుకు హ్యాపీగా వుంది. ఒక ఫ్రెష్‌ కాన్సెప్ట్‌తో చేసిన ఈ సినిమాకి ఫెంటాస్టిక్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు నా థాంక్స్‌.

ప్రవీణ్‌: కొత్తదనాన్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఈ సినిమా మరోసారి ప్రూవ్‌ చేసింది. నిఖిల్‌ ఈ సినిమాతో హ్యాట్రిక్‌ కొట్టాడు. ఈ సినిమాని ఎంతో ప్యాషన్‌తో నిర్మాత శివకుమార్‌గారు నిర్మించారు. కార్తీక్‌ ఒక మంచి చిత్రాన్ని మాకు ఇచ్చాడు. ఈ సినిమాని హిట్‌ చేసిన ప్రేక్షకులకు థాంక్స్‌.

మల్కాపురం శివకుమార్‌: మా సినిమా మొదటి నాలుగు రోజుల్లో మొత్తం 7 కోట్లు గ్రాస్‌ కలెక్ట్‌ చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో 6 కోట్లు, ఓవర్సీస్‌లో 1 కోటి 15 లక్షలు కలెక్ట్‌ చేసింది. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంతో రుణపడి వుంది. నాకు కథ చెప్పిన దానికంటే ఎన్నో రెట్లు బాగా తీశాడు కార్తీక్‌. అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఈ సినిమా రీచ్‌ అయిందని హ్యాపీగా చెప్పగలుగుతున్నాను.

నిఖిల్‌: స్వామిరారా, కార్తికేయ చిత్రాల తర్వాత ఒక మంచి సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నాను. అనుకున్నట్టుగానే సూర్య వర్సెస్‌ సూర్య వంటి మంచి కథ దొరికింది. ఈ సినిమాలో మేం చెప్పిన పాయింట్‌ని ఆడియన్స్‌ బాగా రిసీవ్‌ చేసుకున్నారు. ఎక్స్‌ట్రార్డినరీ కలెక్షన్స్‌తో అన్ని ఏరియాల్లో ప్రదర్శింపడుతోంది. ఏ సినిమా అయినా బాగోకపోతే మ్యాట్నీ నుంచే కలెక్షన్స్‌ డ్రాప్‌ అవుతాయి. అలాంటిది ఈ సినిమా కలెక్షన్స్‌ నాలుగో రోజు ఎక్స్‌ట్రార్డినరీగా వున్నాయి. స్లోగా కలెక్షన్స్‌ పెరుగుతున్నాయి. ఈ సినిమాకి నేషనల్‌ లెవల్‌లో పేరు వస్తున్నందుకు చాలా హ్యాపీగా వుంది. ఈ సినిమా సాధించిన విజయాన్ని ప్రేక్షకులతో పంచుకునేందుకు ఈరోజు నుంచి సెల్ఫీ టూర్‌ చేస్తున్నాము. రెండు రాష్ట్రాల్లో కొన్ని సెంటర్స్‌లో ఈ టూర్‌ వుంటుంది. అక్కడ థియేటర్స్‌కి వెళ్ళి అభిమానులతో సెల్ఫీ ఫోటోలు తీస్తాం. కాబట్టి అందరూ ఇందులో పార్టిసిపేట్‌ చెయ్యాల్సిందిగా కోరుతున్నాను. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ