Advertisement

డాన్స్‌ స్కూల్‌ ‘డి జోన్‌’ని లాంచ్‌ చేసిన దేవిశ్రీప్రసాద్‌

Sun 08th Mar 2015 12:47 PM
dance master satya,d zone dance studio,devisri prasad,bellamkonda suresh,madhu shalini  డాన్స్‌ స్కూల్‌ ‘డి జోన్‌’ని లాంచ్‌ చేసిన దేవిశ్రీప్రసాద్‌
డాన్స్‌ స్కూల్‌ ‘డి జోన్‌’ని లాంచ్‌ చేసిన దేవిశ్రీప్రసాద్‌
Advertisement

ప్రముఖ మూవీ కొరియోగ్రాఫర్‌ ‘ఢీ’ ఫేమ్‌ సత్య మాస్టర్‌ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌ సారధి స్టూడియో సమీపంలో డాన్స్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ స్టూడియో ‘డి జోన్‌’ ప్రారంభమైంది. ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా వర్క్‌ చేయడమే కాకుండా రియాలిటీ షోలు, దేశవిదేశాల్లో ఎన్నో ఈవెంట్స్‌ను చేసిన సత్య మాస్టర్‌ ఎంతోమంది నటనటులకు నృత్యరీతుల్ని నేర్పి మంచి డాన్సర్లుగా తీర్చిదిద్దారు. డాన్స్‌ను ఇంకా చాలామంది నేర్పే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ ‘డి జోన్‌’ డాన్స్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ స్టూడియోను ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ ప్రారంభించారు. ఇంకా ఈ ప్రారంభోత్సవంలో ప్రముఖ నిర్మాతలు ఎం.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, బెల్లంకొండ సురేష్‌, తమ్మారెడ్డి భరద్వాజ, శ్రీనివాసరాజు, హీరోయిన్‌ మధుశాలిని, సంగీత దర్శకుడు రఘు కుంచె తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..

దేవిశ్రీప్రసాద్‌: మా సత్య ప్రారంభించిన ఈ ‘డి జోన్‌’ టైటిల్‌ చాలా కొత్తగా వుంది. ఈ పేరు వినగానే ఇది డాన్స్‌ స్కూల్‌ అని అర్థమయ్యేలా వుంది. సత్య కొరియోగ్రఫీ, డాన్స్‌ నాకు చాలా ఇష్టం. చాలా కాలంగా నాతో వర్క్‌ చేస్తున్నాడు సత్య. నా ప్రతి షోకి సత్య వుంటాడు. మేం చాలా తక్కువ టైమ్‌ ఇచ్చినా మంచి ఔట్‌పుట్‌ ఇచ్చేవాడు. నిన్న రాత్రే ఒక షో మేం సక్సెస్‌ఫుల్‌గా చేశాం. ఈరోజు సత్య ఈ డాన్స్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ స్టూడియోను ప్రారంభించడం ఆనందంగా వుంది. ఇలా ఇంకా ఎన్నో స్టూడియోలు ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక నుంచి అతను సీరియస్‌గా సినిమాలకు కూడా కొరియోగ్రఫీ చేసి ఇండియాలోనే ఒన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ కొరియోగ్రాఫర్స్‌ కావాలని ఆశిస్తున్నాను. 

సత్య: మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా నాకోసం, ఈ స్టూడియో ఓపెనింగ్‌కి ప్రత్యేకంగా చెన్నై నుంచి వచ్చిన దేవిశ్రీప్రసాద్‌గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను చేసిన ఈవెంట్స్‌లో ఇంత క్రేజ్‌ రావడానికి మెయిన్‌ రీజన్‌ దేవిశ్రీప్రసాద్‌గారు. ఇది అందరికీ తెలుసు. ఆయన బ్లెస్సింగ్స్‌, హెల్ప్‌ ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఫేమ్‌ అవ్వడంలో శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిగారి షో ‘ఢీ’ నాకు ఎంతో హెల్ప్‌ అయింది. నాకే కాదు ఎంతోమందికి ఆ షో ఉపయోగపడిరది. నేను ఎంతోమందికి డాన్స్‌ నేర్పించాను. అయితే నాకంటే నా శిష్యులు బాగుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్‌ అవుతాను. ‘డి జోన్‌’ గురించి చెప్పాలంటే ఎంతో మంది మంచి డాన్సర్స్‌ని తయారు చేయాలని ఈ స్టూడియో ప్రారంభించాను. అందరి సహాయ సహకారాలు వుంటాయని ఆశిస్తున్నాను. అలాగే ఈరోజుల్లో ఫిట్‌నెస్‌ కూడా జీవితంలో ఒక భాగమైంది. ఇక్కడ యోగ, ఎరోబిక్స్‌, జోంబా కూడా యాడ్‌ చేసి ప్రొఫెషనల్స్‌ అయిన ఇన్‌స్ట్రక్టర్స్‌ని ప్రతి విభాగంలో వుంచడం జరిగింది. డాన్స్‌లో సల్సా, హిప్‌హాప్‌, ఫ్రీ స్టైల్‌తో పాటు క్లాసికల్‌ డాన్స్‌ కూడా నేర్పించడం జరుగుతుంది. క్లాసికల్‌ డాన్స్‌ అనేది మస్ట్‌గా వుండాలి. ఎందుకంటే క్లాసికల్‌ నేర్చుకుంటే మిగతా డాన్సుల్లో ఆ స్టైల్‌గానీ, పద్ధతి కానీ తెలుస్తుంది. మరో ముఖ్య విషయం ఏమిటంటే మా స్టూడియోలో డాన్స్‌ నేర్చుకోవాలన్న పట్టుదల వుండి అవకాశం లేని పేదవారికి ఉచితంగా డాన్స్‌ నేర్పించడానికి అన్ని ఫెసిలిటీస్‌ కల్పిస్తాం. మంచి డాన్సర్‌ అవ్వాలన్న వారి కోరిక నెరవేర్చాలన్నది నా ఉద్దేశం. 

ఎం.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి: ఢీ కోసం నా దగ్గరికి వచ్చి ఒక డివిడి ఇచ్చాడు సత్య. అది చూసి నేను ఓకే చెప్పాను. అంతవరకే నేను చేసింది. ఆ తర్వాత అతని గ్రోత్‌కి పూర్తిగా అతని కృషే కారణం. అప్పటి నుంచి అతని గ్రాఫ్‌ చూస్తుంటే ఆకాశమే హద్దుగా పెరుగుతోంది. ఈరోజు తనలా చాలా మంది డాన్సర్లు తయారు కావాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన ఈ ‘డి జోన్‌’ డాన్స్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ స్టూడియో సక్సెస్‌ అయి సత్యకి ఇంకా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement