Advertisementt

‘పారా హుషార్‌’ షూటింగ్‌ ప్రారంభం

Sun 08th Mar 2015 12:40 PM
parahushar movie opening,telugu movie parahushar  ‘పారా హుషార్‌’ షూటింగ్‌ ప్రారంభం
‘పారా హుషార్‌’ షూటింగ్‌ ప్రారంభం
Advertisement
Ads by CJ

విజయ్‌ తాండేల్‌, సూర్యచంద్ర, శ్రీవినోద్‌, సుమ, నందితా మండల్‌, కీర్తి ప్రకాష్‌ ప్రధాన పాత్రల్లో శ్రీ సాయిశంకర ప్రొడక్షన్స్‌ పతాకంపై సాయి సునీల్‌ నిమ్మల దర్శకత్వంలో వడ్డే మల్లేష్‌ నిర్మిస్తున్న కామెడీ థ్రిల్లర్‌, ‘పారా హుషార్‌’. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి హీరోయిన్‌ మధుశాలిని క్లాప్‌ నివ్వగా, చిత్రం శ్రీను కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఎడిటర్‌ గౌతంరాజు స్క్రిప్ట్‌ను అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..

సాయి సునీల్‌ నిమ్మల: మర్డర్‌ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎ, బి, సి క్లాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో లవ్‌, కామెడీ, సెంటిమెంట్‌ అన్ని ఎలిమెంట్స్‌ వుంటాయి. మిత్రుడు భీమేశ్వరచారి ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు. అందరం టీమ్‌ వర్క్‌తో ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలన్న ఉద్దేశంతో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం. రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 20 తర్వాత ప్రారంభించి సింగిల్‌ షెడ్యూల్‌లో కంప్లీట్‌ చేస్తాం. 

వడ్డే మల్లేష్‌: మంచి కథతో ఈ చిత్రాన్ని చేస్తున్నాం. అందరికీ నచ్చే అన్ని అంశాలు ఈ చిత్రంలో వుంటాయి. మా బేనర్‌లో నిర్మిస్తున్న మొదటి చిత్రమిది. అందరి సహకారం నాకు వుంటుందని ఆశిస్తున్నాను.

భీమేశ్వరాచారి: లవ్‌, సెంటిమెంట్‌తో ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇందులో ప్రతి క్యారెక్టర్‌కీ ఇంపార్టెన్స్‌ వుంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

వై.వి.లక్ష్మీనారాయణ: ఆనంద్‌ సినీ సర్వీస్‌లో 18 సంవత్సరాలు కెమెరా అసిస్టెంట్‌గా 700 సినిమాలకుపైగా వర్క్‌ చేశాను. సినిమాటోగ్రాఫర్‌గా ఇది నా రెండో సినిమా. ఈ సినిమా కాన్సెప్ట్‌ నాకు బాగా నచ్చింది. దానికి తగ్గట్టుగానే నా వంతు కృషి చేసి మంచి ఔట్‌ పుట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

కాసర్ల శ్యామ్‌: సాయి సునీల్‌ రచయితగా నాకు పరిచయం. మంచి రైటర్‌. అయినా తన మిత్రుడు భీమేశ్వరాచారి చెప్పిన కథ నచ్చి ఈ సినిమాకి డైరెక్షన్‌ చేస్తున్నాడు. ఇందులో 6 పాటలు వున్నాయి. అన్నీ నేనే రాస్తున్నాను. స్నేహం గురించి రాసిన ఒక పాట ‘హ్యాపీడేస్‌’లోని సాంగ్‌ కంటే పెద్ద హిట్‌ అవుతుందని నమ్ముతున్నాను. 

ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న విజయ్‌ తాండేల్‌, సూర్యచంద్ర, శ్రీవినోద్‌, సుమ, నందితా మండల్‌, కీర్తి ప్రకాష్‌ తమకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని సినిమా బాగా రావడానికి కష్టపడి వర్క్‌ చేస్తామని తెలిపారు. 

ఈ చిత్రానికి కథ, మాటలు: సి.భీమేశ్వరాచారి, సినిమాటోగ్రఫీ: వై.వి.లక్ష్మీనారాయణ, డాన్స్‌: కిరణ్‌, లక్కీశ్యామ్‌, పాటలు: కాసర్ల శ్యామ్‌, సంగీతం: చిన్ని చరణ్‌, కిరణ్‌ వెన్న, నిర్మాత: వడ్డే మల్లేష్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సాయిసునీల్‌ నిమ్మల. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ