Advertisementt

ఏప్రిల్‌ 17న నాగచైతన్య ‘దోచేయ్‌’

Sat 07th Mar 2015 06:30 AM
dochey,naga chaitanya,kriti senon,sudheer varma,b.v.s.n.prasad,dochey on 17th april  ఏప్రిల్‌ 17న నాగచైతన్య ‘దోచేయ్‌’
ఏప్రిల్‌ 17న నాగచైతన్య ‘దోచేయ్‌’
Advertisement
Ads by CJ

నాగచైతన్య కథానాయకుడిగా, 1 నేనొక్కడినే ఫేం కృతి సనన్‌ హీరోయిన్‌గా, స్వామిరారా వంటి సూపర్‌హిట్‌ చిత్రానికి దర్శకత్వం వహించిన సుధీర్‌వర్మ దర్శకత్వంలో అత్తారింటికి దారేది వంటి ఇండస్ట్రీ హిట్‌ని నిర్మించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఈ చిత్రం నిర్మాణం జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా ఏప్రిల్‌ 17న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేయబోతున్నారు. 

ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ఇటీవల పీటర్‌ హెయిన్స్‌ నేతృత్వంలో నాగచైతన్యతో ఓ థ్రిల్లింగ్‌ ఛేజ్‌ని చిత్రీకరించడం జరిగింది. ఆ ఛేజ్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. రెండు పాటలు సెట్స్‌లోనూ, ఒక పాట బ్యాంకాక్‌లోనూ తీశాం. దీంతో మా ‘దోచేయ్‌’ చిత్రం షూటింగ్‌ ఆల్‌మోస్ట్‌ కంప్లీట్‌ అయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సమ్మర్‌ స్పెషల్‌గా ఏప్రిల్‌ 17న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు.  

యువసామ్రాట్‌ నాగచైతన్య సరసన కృతి సనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, రవిబాబు, రావు రమేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్‌., సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌, ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, కెచ్చా కంఫక్డే, విజయ్‌, డాన్స్‌: జానీ, శేఖర్‌, ఆర్ట్‌: నారాయణరెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌ ఈదర, కో`ప్రొడ్యూసర్‌: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: సుధీర్‌వర్మ. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ