సాధారణంగా సినిమాల్లో ఓ స్పెషల్ క్యారెక్టర్ కోసం నటీనటులు అతి స్వల్ప కాలంలో బరువు పెరగడమో తగ్గడమో చేస్తుంటారు. ఇప్పుడు హీరోయిన్ అనుష్క కూడా ఇదే పరీక్షను ఎదుర్కొబోతున్నారు. ఐదు కాదు.. పది కాదు.. ఏకంగా 20 కిలోల బరువు పెరగడానికి ఇప్పుడు అనుష్క తెగ కష్టపడుతున్నారు. కోవెలమూడి ప్రకాశ్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పేరు 'సైజ్ జీరో' కావడం మరో విశేషం. బాహ్య సౌందర్యం కన్నా.. అంతర్ సౌందర్యం ప్రధానమైందని చెప్పే ఉద్దేశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే 'బహుబలి', 'రుద్రమదేవి' చిత్రాల కోసం కత్తి యుద్ధం, గుర్రపు స్వారి నేర్చుకున్న అనుష్క ఇక ఇప్పుడు అదే పనిగా తిండి తింటూ బరువు పెరగే పనిలో ఉన్నారు.